Tata Nexon Car EMI and Loan Details: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ 'టాటా నెక్సాన్'. జనవరి 2023 నెలలో టాటా నెక్సాన్ యొక్క 15,567 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశంలోని చాలా మందికి ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ మొదటి ఎంపికగా ఉంది. మీరు ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే.. కనీసం కారు గురించి ప్రాథమిక వివరాలు అయినా తెలుసుకోవాలి. అలాగే మీరు టాటా నెక్సాన్ ధర గురించి సమాచారాన్ని కలిగి ఉండాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా నెక్సాన్ ధర రూ. 7.80 లక్షల నుంచి రూ. 14.35 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉంటుంది. అంటే టాటా నెక్సాన్ బేస్ వేరియంట్ ధర రూ. 7.80 లక్షలు కాగా.. ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 8.85 లక్షల వరకు ఉంటుంది. మీరు బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేసి ఆన్-రోడ్ ధరలో 10% డౌన్‌పేమెంట్ (రూ. 88,500) చేస్తే.. మీరు దాదాపు రూ. 8 లక్షల రుణం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రుణం 9% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలు పెడితే.. యాక్సిస్ బ్యాంక్ ఈఎంఐ కాలిక్యులేటర్ ప్రకారం నెలకు రూ. 16,607 అవుతుంది. అంటే  90 వేల డౌన్‌ పేమెంట్‌తో టాటా నెక్సన్‌ని ఇంటికి తీసుకెళ్లి పోవచ్చు.


టాటా నెక్సన్‌లో సన్‌రూఫ్, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో), రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, క్లైమేట్ కంట్రోల్ AC, వాయిస్ కమాండ్‌లు మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో డిమ్మింగ్ IVRM, హర్మాన్ చేత సౌండ్ సిస్టమ్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ టాటా నెక్సన్‌లో అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉండవు.


Also Read: Vehicle Insurance Policy: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం పట్టుబడితే.. ఇక అంతేసంగతులు! ఫాస్ట్‌ట్యాగ్ నుంచి డబ్బు కట్  


Also Read: Lakshmi Narayan Yog 2023: అరుదైన లక్ష్మీ నారాయణయోగం.. ఈ 3 రాశుల వారి అన్ని కోరికలు నెరవేరుతాయి! డబ్బు సమస్య తొలగిపోతుంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.