Vehicle Insurance Policy: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం పట్టుబడితే.. ఇక అంతేసంగతులు! ఫాస్ట్‌ట్యాగ్ నుంచి డబ్బు కట్

Government plans revamp of auto insurance policy soon. ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వాహనదారులకు త్వరలో కేంద్రం భారీ షాక్ ఇవ్వనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 2, 2023, 11:43 AM IST
  • ఇన్సూరెన్స్ లేకుండా వాహనం పట్టుబడితే
  • ఇక అంతేసంగతులు
  • ఫాస్ట్‌ట్యాగ్ నుంచి డబ్బు కట్
Vehicle Insurance Policy: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం పట్టుబడితే.. ఇక అంతేసంగతులు! ఫాస్ట్‌ట్యాగ్ నుంచి డబ్బు కట్

If Vehicle caught without insurance money will be deducted from fastag: ఇకపై ఇన్సూరెన్స్ (బీమా) లేకుండా రోడ్డుపై వాహనంను నడపడం అస్సలు సాధ్యం కాదు. ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వాహనదారులకు త్వరలో కేంద్రం భారీ షాక్ ఇవ్వనుంది. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే.. మీరు అక్కడికక్కడే బీమాను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ సహాయంతో పట్టుబడిన స్థలంలోనే ఇన్సూరెన్స్ కట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం రవాణా శాఖ ప్రత్యేకంగా ప్రణాళికలను రూపొందిస్తోంది. 

దేశంలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అదేసమయంలో నిబంధనల ఉల్లంఘనలు కూడా పెరుగుతున్నాయి. దాంతో ఇన్సూరెన్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగిన సందర్భాలలో థర్డ్ పార్టీకి పరిహారం అందించే వీలులేకుండా పోతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 40-50 శాతం వాహనాలు బీమా లేకుండానే రోడ్లపై నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం వాహనానికి థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇన్సూరెన్స్ లేని చాలా వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రమాద బాధితులకు వైద్యం అందకుండా పోతుంది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడిన వాహనాలకు అక్కడికక్కడే బీమా చేయించాలని కేంద్రం భావిస్తోంది.

అక్కడికక్కడే బీమా చేయించే ఏర్పాట్లపై పలు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్యను తగ్గించేందుకు జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ముఖ్యంగా జాతీయ రహదారులపై తిరిగే వాహనాలకు కచ్చితంగా బీమా ఉండేలా చూడాలని సూచించింది. ఇలాంటి వాహనాలను గుర్తించేందుకు కొత్త రకం పరికరాన్ని ఉపయోగించాలని సిఫార్సు చేసింది. ఈ సూచనలపై మార్చి 17న జరిగే సమావేశంలో తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.

పలు నివేదికల ప్రకారం... పోలీసు మరియు రవాణా శాఖ అధికారులు రోడ్డు మరియు రహదారుల మంత్రిత్వ శాఖ యొక్క వాహన యాప్ సహాయంతో పట్టుకున్న వాహనం పూర్తి సమాచారాన్ని సంగ్రహిస్తారు. వాహనంకు బీమా లేకపోతే రవాణా శాఖ నెట్‌వర్క్‌కు అనుసంధానించబడిన సాధారణ బీమా సంస్థలు వెంటనే బీమా పాలసీని కొనుగోలు చేసే ఎంపికను వాహన యజమానికి అందిస్తాయి. ఈ పాలసీల కోసం తక్షణమే ప్రీమియంల చెల్లింపు కోసం బ్యాంకులు, బీమా కంపెనీలను ఫాస్ట్‌ట్యాగ్ సదుపాయం అందించనుంది. 

థర్డ్ పార్టీ బీమా కోసం ప్రీమియం వాహనం పరిమాణం మరియు మోడల్పై ఆధారపడి ఉంటుంది. 1000సీసీ ప్యాసింజర్ వాహనాలకు రూ.2072, 1000-1500సీసీ వాహనాలకు రూ.3221 మరియు 1500సీసీ ఇంజిన్ ఉన్న వాహనాలకు రూ.7890గా ఉండనుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ (IRDA) ఇప్పటికే బీమా కంపెనీలను సీజ్ చేసిన వాహనాలకు తాత్కాలిక లేదా స్వల్పకాలిక మోటారు బీమాను జారీ చేయడానికి అనుమతించింది.

Also Read: IND vs AUS: గవాస్కర్.. మీరు చాలా కఠినమైన వ్యక్తి! గిల్ విషయంలో సన్నీపై హేడెన్‌ ఘాటు వ్యాఖ్యలు  

Also Read: Assembly Elections 2023 Results: ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. 12 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News