Tata Tiago Cng: మొట్టమొదటి Tata Tiago Cng కార్ రాబోతోంది..ఫీచర్స్, ధర, మైలేజీ వివరాలు ఇవే!
Tata Tiago Cng Mileage And Price: త్వరలోనే టాటా కంపెనీ మొట్టమొదటి CNG కారును మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. ఈ మోడల్స్ అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో రాబోతోంది. అయితే ఈ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Tiago Cng Mileage And Price: టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆటోమొబైల్ రంగంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను దృష్టిలో పెట్టుకుని దాదాపు అన్ని ఆటో మొబైల్ కంపెనీ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ కార్లను విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్, CNG కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మొట్టమొదటి CNG కారును విడుదల చేసింది. ఈ కారు ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అనేక రకాల వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అతి తక్కువ ధరలోనే మంచి సిఎన్‌జీ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే టాటా మోటార్స్ లాంచ్ చేయబోయే Tigor iCNG AMT మోడళ్లపై కంపెనీ ఆన్‌లైన్‌లో బుక్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్లను రూ.21,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. ఈ Tiago iCNG కార్స్‌ను కంపెనీ రూ. 7.80 లక్షల లోపే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ కొత్త Tiago iCNG AMT కార్లను మూడు వేరియంట్ల( XTA CNG, XZA+ CNG, XZA NRG)లో లాంచ్ చేయబోతోంది.
ట్విన్ సిలిండర్ టెక్నాలజీ:
ఈ మూడు వేరియంట్స్ ట్విన్-సిలిండర్ CNG టెక్నాలజీతో మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కంపెనీ ఈ మోడల్స్‌లో అదనపు బూట్ స్పేస్‌ను కూడా అందిస్తోంది. అలాగే కంపెనీ ఈ కార్లలో అనేక రకాల సెక్యూరిటీ ఫీచర్లను కూడా అందిస్తోంది. కంపెనీ ఇందులో థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు iCNGలో అధునాతన మెటీరియల్‌తో రాబోతోంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
కంపెనీ ఈ కారులో గ్యాస్ లీక్ డిటెక్షన్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. కాబట్టి ఈ ఫీచర్స్‌తో గ్యాస్ లీక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ కారులో పెట్రోల్ మోడ్‌ను కూడా కలిగి ఉంది. ఈ కారులోని సిఎన్‌జీ గ్యాస్ అయిపోయిన వెంటనే పెట్రోల్‌లోకి మార్చుకోవచ్చు. ఈ iCNG AMT కార్లు 1.2L Revotron ఇంజన్‌తో రన్ అవ్వబోతున్నాయి. టాటా మోటార్స్ ఈ మోడళ్లను కొత్త రంగులో మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter