Beetroot idli preparation: ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బీట్రూట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం..
షుగర్, బీపీ లాంటి వ్యాధులను తగ్గించి.. బరువుకి సైతం చెక్ పెట్టే బీట్రూట్ ఇడ్లీ తయారీ విధానం కోసం.. ముందుగా రెండు బీట్ రూట్ లను తురుమల చేసి పెట్టుకోండి.
మరోపక్క ఒక కప్పు ఓట్స్ ని బాగా పొడి చేసి పెట్టుకో..
ఇప్పుడు ఈ ఓట్స్ పొడిలోనే కొద్దిగా ఉప్పు, రవ్వ వేసి మరోసారి మెత్తగా మిక్సీ పత్తి ఒక బౌల్ లోకి వేసుకోండి.
అదే బౌల్లో ఈనో లేదా ఫ్రూట్ సాల్ట్, అరకప్పు పెరుగు, మనం ముందుగా చేసుకున్న బీట్ రూట్ తురుము వేసుకుని కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేయండి.
గంట తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని.. ఇడ్లీ ప్లేస్ కి కొద్దిగా నూనె వేసుకుంటూ.. మనం చేసిపెట్టుకున్న పిండిని ఇడ్లీలలో వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి.
తయారైన ఇడ్లీలను.. ఏ చట్నీతో తిన్నా సరే.. రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం.