March 4th 2022 Gold and Silver Rates In Hyderabad: పసిడి ప్రియులకు శుభవార్త. ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత కాస్త దిగివచ్చిన బంగారం, వెండి ధరలు.. గత 4-5 రోజులుగా పెరుగుతూ వచ్చాయి. గురువారం (2022 మార్చి 3) కూడా పసిడి, వెండి ధరలు పెరగ్గా.. శుక్రవారం (మార్చి 4) మాత్రం కాస్త దిగొచ్చాయి. 10 గ్రాముల బంగారం ధరపై 400 వరకు తగ్గింది. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగానే పెరిగింది. కిలో వెండి ధరపై రూ.100కు పైగా పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉక్రెయిన్‌, రష్యా సంక్షోభం కారణంగా పసిడి ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. ఆందోళనకు గురవుతున్న బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిస్తున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర భారత మార్కెట్లో రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 


ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,470గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,850 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా ఉంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.47,300.. 24 క్యారెట్ల ధర రూ.51,600గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,600 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,300గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.72,500, విజయవాడలో రూ.72,500, విశాఖపట్నంలో రూ.72,500లుగా ఉంది. 


Also Read: Horoscope Today March 4 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి!!


Also Read: Ajith New Look: స్టైలిష్‌ లుక్‌లో అజిత్‌.. ఆ సినిమా కోసమేనా?!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook