బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పతనమయ్యాయి. మరోవైపు మార్కెట్‌లో వెండి ధరలు స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.1,890 మేర భారీగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,050 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,800కి క్షీణించింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బంగారం ధరలలో ఎలాంటి మార్పులేదు. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,760 వద్ద మార్కెట్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,280 వద్ద కొనసాగుతోంది.



 


గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో తగ్గిన వెండి ధరలు (Silver Rate in India) తాజాగా పెరుగుతున్నాయి. తాజాగా వెండి ధర రూ.1,00 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,700కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో మార్కెట్ అవుతోంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe