March 26th 2022 Petrol, Diesel Prices In Hyderabad: చమురు మార్కెటింగ్ సంస్థలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రికార్డు స్థాయిలో 137 రోజులు  శాంతించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో.. ఇంధన ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) గణాంకాల ప్రకారం.. శనివారం (మార్చి 26) పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా 70 పైసలు మరియు 80 పైసలు పెరిగాయి. గడిచిన ఐదు రోజుల్లో ధరలు పెరడగం ఇది నాలుగోసారి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చమురు కంపెనీలు మార్చి 22 నుంచి (మార్చి 24 మినహా) పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచుతూనే ఉన్నాయి. శుక్రవారం చమురు ధరలపై 80 పైసల మేర పెరగ్గా.. శనివారం అది కంటిన్యూ అయ్యింది. ఈరోజు పెరిగిన ధరలతో దేశ రాజధాని డిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 98.61 పైసలకు చేరగా.. డీజిల్‌ ధర రూ. 89.87 పైసలకు పెరిగింది. ముంబైలో పెట్రోల్ 84 పైసలు పెరిగి.. లీటర్‌ రూ. 113.35కి చేరింది. చెన్నైలో 76 పైసలు పెరిగి రూ. 104.43కి చేరుకోగా.. కోల్‌కతాలో 83 పైసల పెరిగి రూ. 108.01కి చేరింది.


తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధరపై 0.89 పెసలు పెరిగి.. రూ. 111.80 చేరింది. ఇక లీటర్‌ డీజిల్‌ ధరపై 0.86 పైసలు పెరిగి.. రూ. 98.10గా ఉంది. ఏపీలోని విజయవాడలో పెట్రోల్‌ ధర 113 రూపాయల 62 పైసలు, డీజిల్‌ 99 రూపాయల 56 పైసలకు పెరిగింది. ఇక గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 113.83లుగా.. డీజిల్‌ ధర రూ. 99.76లుగా ఉంది. ఐదు రోజుల వ్యవధిలో చమురు  ధరలు నాలుగుసార్లు పెరిగాయి. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 3 రూపాయల 10 పైసలు పెట్రోల్‌ ధరలపై పెరిగాయి.


2021 నవంబర్ 4 నుంచి 2022 మార్చి 22 వరకు పెట్రోల్ మరియు డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ కాలంలో ముడి చమురు ధర బ్యారెల్‌కు $30 పెరిగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత (మార్చి 10 తర్వాత) ఇంధన ధరలు పెరుగుతాయని భావించినప్పటికీ.. దాదాపుగా రెండు వారాల పాటు వాయిదా పడింది. గత ఐదు రోజులుగా పెట్రో బాదుడు మొదలైంది. ఇలాగే పెట్రోల్‌, డిజీల్‌ ధరలు పెరిగితే సామాన్యుడిపై పెనుభారం పడనుంది. 


Also Read: Gold and Silver Price Today: మరోసారి షాకిచ్చిన పసిడి ధర.. హైదరాబాద్‌లో బంగారం, వెండి రేట్లు ఎంత పెరిగాయంటే!!


Also Read: Kishan reddy on TS Govt: 'ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై విమర్శలు తగవు'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook