March 26th 2022 Gold and Silver Prices In Hyderabad: పలు కారణాల వల్ల బంగారం, వెండి ధరలు ప్రతిరోజు మారుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ కారణంగా ఇటీవలి కాలంలో 10 గ్రాముల పసిడి ధర రూ. 53 వేలకు దూసుకెళ్లింది. అయితే గతకొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించగా.. శనివారం (మార్చి 26) కూడా అది కంటిన్యూ అయ్యింది. మరోవైపు వెండి ధరలు కూడా పసిడి బాటలోనే నడిచాయి.
శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.48,200లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,590లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 250 పెరగ్గా.. 24 క్యారెట్ల ధరపై కూడా రూ. 280 పెరిగింది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.70,000గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ. 1500 పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,590గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,590గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,540గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,960 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200.. 24 క్యారెట్ల ధర రూ.52,590గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,590గా ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,590గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.48,200.. 24 క్యారెట్ల ధర రూ.52,590గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,590 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,800లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.73,800లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే ఏకంగా రూ. 3,800 పెరిగింది.
Also Read: IPL 2022: మెరుపు హాఫ్ సెంచరీ బాదిన ఫాఫ్ డుప్లెసిస్.. కెప్టెన్‌గా ఇదే తొలి విజయం! కోహ్లీ దూరం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook