Top smartphones: శాంసంగ్, వన్‌ప్లస్, గూగుల్ నుంచి ఈ నెలలో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్లు
Top smartphones: ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ చాలా పెద్దది. అందుకే ఎప్పటికప్పుడు ప్రముఖ కంపెనీలు వివిధ రకాల మోడల్స్ లాంచ్ చేస్తుంటాయి. వీటిలో చైనా కంపెనీలదే మేజర్ వాటా అనడంలో సందేహం లేదు. ఇప్పుడు మే నెలలో సైతం మరికొన్ని స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
Top smartphones: దేశంలో దాదాపు అన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Apple iPhone, Samsung, OnePlus, Oppo, Vivo, Google, Remdi, Xiaomi, Realme, Poco ఇలా దాదాపు అన్ని కంపెనీల ఫోన్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు మే నెలలో కొన్ని ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి.
OnePlus Nord 4 వన్‌ప్లస్ సంస్థ నుంచి ఈ కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ ఈ నెలలో లాంచ్ కానుంది. OnePlus Ace ఫోన్‌ను ఇండియన్ మార్కెట్ కోసం రీ బ్రాండ్ చేసిన వెర్షన్‌గా భావిస్తున్నారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 చిప్‌సెట్ ఉంటుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కలిగి ఉంటుంది.
Samsung Galaxy F55 శాంసంగ్ సంస్థ నుంచి లాంచ్ కానున్న మరో కొత్త మోడల్ ఇది. ఫుల్ లెదర్ బాడీతో ఉండే ఈ ఫోన్ టీజర్ ఇటీవలే విడుదలైంది. ట్రిపుల్ కెమేరా సెటప్ కలిగి ఉంటుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన్ శాంసంగ్ గెలాక్సీ సి55 మోడల్ ఫోన్‌కు రీ బ్రాండ్ అని చెప్పవచ్చు. ఇది కూడా స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ కలిగి ఎమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ప్రత్యేకత.
Google Pixel 8a గూగుల్ నుంచి వస్తున్న కొత్త మోడల్. గూగుల్ పిక్సెల్ 7ఎకు కొనసాగింపు సిరీస్‌లో భాగంగా వస్తోంది. అధికారికంగా లాంచ్ డేట్ వెల్లడి కాకున్నా ఈ నెల మొదటి వారంలోనే లాంచ్ కావచ్చు. ఇదొక ప్రీమియం ఫోన్. టెన్సార్ జి3 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉండటంతో ఫోన్ ఆకట్టుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ వెర్షన్ ఉంటుంది.
Motorola Edge 50 Ultra మోటోరోలా కంపెనీ లాంచ్ చేస్తున్న కొత్త మోడల్ ఫోన్ ఇది. ఇది కూడా ఈ నెలలోనే లాంచ్ కానుంది. మోటోరోలా 50 ప్రో కంటే అద్భుతమైన సెన్సార్‌లు కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంటుంది.
Vivo V30e వివో నుంచి మే 2 వ తేదీన ఇండియాలో లాంచ్ కానుంది. వివో కంపెనీ వి సిరీస్ ఫోన్‌లలో డిజైన్, కెమేరాపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటుంది. 3డి కర్వ్ డిస్‌ప్లే, డ్యూయల్ రేర్ కెమేరా సెటప్ ఉంటుంది.
Also read: Gold Purity Test: బంగారం ఒరిజినలా కాదా ఎలా తెలుసుకోవడం, ఈ చిట్కాలు చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook