Gold Purity Test: బంగారం ఒరిజినలా కాదా ఎలా తెలుసుకోవడం, ఈ చిట్కాలు చాలు

Gold Purity Test: ఇండియాలో బంగారం అంటే చాలా మక్కువ. బంగారం కొనుగోలుపై భారతీయలు చూపించినంత ఆసక్తి మరెవరూ చూపించరంటే అతిశయోక్తి కాదు. బంగారం అంటే ఇక్కడ ఓ సంపద. ఓ అదృష్టం. ఓ మంచి నమ్మకం. ఆ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో నకిలీ బంగారంతో మోసపోతున్న కేసులు కూడా ఉంటున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 2, 2024, 11:55 AM IST
Gold Purity Test: బంగారం ఒరిజినలా కాదా ఎలా తెలుసుకోవడం, ఈ చిట్కాలు చాలు

Gold Purity Test: బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతుండటంతో బంగారంపై పెట్టుబడి పెడుతుంటారు అందరూ. బంగారం ఆభరణాల రూపంలో లేదా బిస్కట్ల రూపంలో లేదా బార్ రూపంలో కొనుగోలు చేస్తుంటారు. అదే సమయంలో మార్కెట్‌లో నకిలీ బంగారం బెడద పెరగడంతో కొనే ముందు బంగారం అసలుదా నకిలీదా అనేది చెక్ చేసుకోవాలి. బంగారం అసలైందా లేదా నకిలీ అనేది తెలుసుకునేందుకు కొన్ని చిట్కాల సహాయంతో సులభంగా తెలుసుకోవచ్చు.

వెనిగర్ టెస్ట్

బంగారం నాణ్యతను వెనిగర్ పరీక్షతో తెలుసుకోవచ్చు. బంగారంపై కొన్ని వెనిగర్ చుక్కలు వేసి నిరీక్షించాలి. రంగు మారుతుందంటే ఆ బంగారం నకిలీ అని అర్ధం. రంగు మారకుంటే ప్యూర్ గోల్డ్ అని అర్ధం.

ఫ్లోటింగ్ టెస్ట్

బంగారం అనేది నీటిలో ప్రవహించదు. ఎందుకంటే ఇందులో అణువులు ఒకదానికొకటి అంటుకుని ఉండి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. దాంతో బంగారం ప్రవహించదు. అంటే నీటిలో తేలదు. అదే నకిలీ అయితే మాత్రం తేలుతుంది

యాసిడ్ టెస్ట్

యాసిడ్ టెస్ట్ అనేది అత్యంత నమ్మకమైన విధానం. చాలామంది ఇదే విధానం అనుసరిస్తుంటారు. దీనికోసం హైడ్రోక్లోరిక్, నైట్రిక్ యాసిడ్స్ , ఓ రాయి అవసరమౌతాయి. ముందుగా బంగారాన్ని ఓ రాయిపై రుద్దాలి. ఇప్పుడీ బంగారం రేణువులపై హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ మిశ్రమం కలపాలి. బంగారం నకిలీ అయితే అందులో కరుగుతుంది. లేదా అలాగే ఉంటుంది. 

మ్యాగ్నెట్ టెస్ట్

బంగారం ప్యూరిటీ చెక్ చేసే అత్యంత చవకైన పద్ధతి మ్యాగ్నెట్ టెస్ట్. ఎందుకంటే లోహాలకు మ్యాగ్నెట్ గుణాలుంటాయి. బంగారం లోహం కానందున మ్యాగ్నెట్ కు ఆకర్షితం కాదు. బంగారానికి మ్యాగ్నెట్ చేరిస్తే అది ఆకర్షించబడిందంటే నకిలీ అని అర్ధం. లేదా ఒరిజినల్ అని అర్ధం. 

హాల్‌మార్క్ లోగో

ఈ పరీక్షలేవీ చేయకుండానే బంగారం అసలైందా కాదా తెలుసుకోవాలంటే ఒకే ఒక విధానం ఐఎస్ఐ హాల్‌మార్క్ ఉందో లేదో చూడటమే. ఎందుకంటే హాల్‌మార్క్ అనేది బంగారం ఆభరణాలపై బ్యూరో ఆప్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేసే ప్రభుత్వ మార్క్. హాల్‌మార్క్ లేకుంటే ఆ బంగారం ప్యూరిటీపై సందేహాలు వస్తుంటాయి. గోల్డ్ జ్యువెల్లరీ మార్కెట్‌లో ఇప్పుడీ విధానమే అందుబాటులో ఉంది. 

Also read: Old vs New Tax Regime: ఉద్యోగులకు ఏ ట్యాక్స్ రెజీమ్ మంచిది, రెండింటీకీ తేడా ఏంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News