TRAI Order: ట్రాయ్. టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనలు అనుసరించి..దేశంలో పది అంకెల మొబైల్ నెంబర్లు ఇకపై అంటే మరో 5 రోజుల తరువాత పనిచేయవు. అలాగైతే ఎలా..అసలిది నిజమేనా, ఇన్ని కోట్ల నెంబర్లు ఏం చేయాలి. ఈ ప్రశ్నలే విన్పిస్తున్నాయిప్పుడు. అసలు సంగతేంటంటే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రాయ్ ఇటీవల కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. ఆ నిబంధన ప్రకారం రిజిస్టర్ కాని పది అంకెల మొబైల్ నెంబర్లు మరో 5 రోజుల్లో అంటే మార్చ్ 20 నుంచి పనిచేయవు. దీనికి సంబంధించిన ప్రకటన గత నెల అంటే ఫిబ్రవరి 16న వెలువడింది. అన్‌రిజిస్టర్ మొబైల్ నెంబర్ల నుంచి కాల్స్ చేయడాన్ని ట్రాయ్ బ్యాన్ చేసింది. అంటే మరో 5 రోజుల తరువాత పదంకెల మొబైల్ నెంబర్ల నుంచి ప్రమోషనల్ కాల్స్, మెస్సేజ్‌లు నిలిచిపోతాయి. ఇకపై వాటి బెడద ఉండదు. 


ప్రమోషన్ వ్యవహారాల్లో పదంకెల నెంబర్ వినియోగం


యూజర్లను వేధించే ప్రొమోషనల్ మెస్సేజ్‌ల విషయంలో ట్రాయ్ కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రమోషన్ వ్యవహారాల కోసం పది అంకెల మొబైల్ నెంబర్ వినియోగించకూడదని ట్రాయ్ చెబుతోంది. ఇదంతా వాస్తవానికి సాధారణ, ప్రమోషనల్ కాల్స్ కోసం వివిధ రకాల నెంబర్లు వినియోగించాల్సి ఉంటుంది. దీనివల్ల సాధారణ, ప్రమోషనల్ కాల్స్‌ను గుర్తించవచ్చు. అయితే ఇంకా కొన్ని టెలీకం ఆపరేటర్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషనల్ మెస్సేజ్‌ల కోసం పది అంకెల మొబైల్ నెంబర్లు వినియోగిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే ట్రాయ్ మరో 5 రోజుల్లో కొత్త నిబంధన అమలు చేనుంది. ఒకవేళ ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే పది అంకెల మొబైల్ నెంబర్ పనిచేయదు.


ఏం చేయకూడదు


పది అంకెల మొబైల్ నెంబర్ ప్రమోషనల్ వ్యవహారాలకు వినియోగిస్తే ఆ నెంబర్ ఇక ఆగిపోతుంది. లేదా మొబైల్ నెంబర్‌ని ట్రాయ్ బ్లాక్ చేస్తుంది. అందుకే వ్యక్తిగత మొబైల్ నెంబర్ల నుంచి టెలీ మార్కెటింగ్ కంపెనీలు కాల్స్ చేయడం, మెస్సేజిలు పంపించడం చేయకూడదు. దీనికోసం కంపెనీల రిజిస్టర్ మొబైల్ నెంబర్ వినియోగించాల్సి ఉంటుది. 


Also read: SBI Offers: ఎస్‌బీఐ మీకు అకౌంట్ ఉందా..? మార్చి 31 వరకు సూపర్ ఆఫర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook