SBI Offers: ఎస్‌బీఐ మీకు అకౌంట్ ఉందా..? మార్చి 31 వరకు సూపర్ ఆఫర్.. మిస్ అవ్వకండి!

SBI FD Interest Rates: స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్నవారికి శుభవార్త. ఎస్‌బీఐ కస్టమర్‌లు ఇప్పుడు రూ.40,088 ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందగలరు. అయితే ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే ఉంది.
 

  • Mar 14, 2023, 00:55 AM IST
1 /5

ఎస్‌బీఐ 400 రోజుల ఎఫ్‌డీపై 7.1 శాతం రేటు ప్రయోజనాన్ని అందిస్తోంది. దీంతో రూ.2 కోట్ల లోపు మొత్తంపై 25 బేసిస్ పాయింట్లు పెరిగాయి. మీరు మార్చి 31 వరకు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. 

2 /5

ఎస్‌బీఐ తన ప్రత్యేక పథకంపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత రూ.5,40,088 వస్తుంది. ఇందులో మీకు రూ.40,088 వడ్డీ లభిస్తుంది. ఇది మీ స్థిర ఆదాయం. మీరు ఏదైనా శాఖ ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.   

3 /5

మీరు మార్చి 31 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు ఇంకా ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయనట్లయితే.. గడువు ముగిసేలోపు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి. 

4 /5

రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ల విషయానికి వస్తే.. బ్యాంక్ దీనిపై 25 బేసిస్ పాయింట్లను పెంచింది. మొదటి ఒక సంవత్సరం మెచ్యూరిటీ ఎఫ్‌డీ 6.75 శాతం ప్రయోజనం పొందుతోంది. ఇప్పుడు దీనిపై 0.05 శాతం పెరిగి.. ఆ తర్వాత 6.80 శాతం లాభం వస్తోంది. అదే సమయంలో ఇంతకుముందు 2 సంవత్సరాల ఎఫ్‌డీపై 6.75 శాతం వడ్డీ లభించగా.. ఇప్పుడు 7 శాతం వడ్డీ ప్రయోజనం పొందుతోంది.

5 /5

మూడేళ్ల మెచ్యూరిటీతో ఎఫ్‌డీ గురించి మాట్లాడినట్లయితే.. ఇంతకుముందు ఇది 6.25 శాతం చొప్పున ప్రయోజనం పొందుతుండగా.. 6.50 శాతానికి పెరిగింది. అదేసమయంలో ఐదేళ్ల మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీలపై ఇంతకుముందు ఉన్న 6.25 శాతానికి బదులుగా ఇప్పుడు 6.50 శాతం వడ్డీని అందుకుంటున్నారు. బ్యాంక్ కొత్త రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వచ్చాయి.