Travel with Platform Ticket: ఇకపై రిజర్వేషన్ లేకుండానే ప్లాట్ ఫారమ్ టికెట్ తో రైళ్లలో ప్రయాణించవచ్చు!
Train Travel with Platform Ticket: రైలు ప్రయాణికులు గుడ్ న్యూస్! మీ దగ్గర రిజర్వేషన్ లేకున్నా.. ఇకపై ట్రైన్ లో ప్రయాణించవచ్చు. అది కూడా ప్లాట్ ఫారమ్ టికెట్ తో! సాధారణ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని రైల్వే బోర్డ్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే ప్లాట్ ఫారమ్ టికెట్ తో రైలు ప్రయాణం ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం.
Train Travel with Platform Ticket: రైలులో ప్రయాణించే వారికి శుభవార్త! ఇకపై ప్లాట్ ఫారమ్ టికెట్ తోనే రైలులో ప్రయాణించవచ్చు. అదెలాగంటే..? చాలా సార్లు మీరు అకస్మాత్తుగా ప్రయాణించాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో మీకు రిజర్వేషన్ లేకుండా.. తత్కాల్ టికెట్ పై ప్రయాణించవచ్చు. అయినా ఆ తత్కాల్ టికెట్ దొరకడం సులభం కాదు. అయితే రైల్వేలో ఇప్పుడు మారిన కొత్త నిబంధనల గురించి మీకు చెప్పబోతున్నాం. దీని ప్రకారం మీరు రిజర్వేషన్ లేకున్నా రైలులో ప్రయాణించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌పై ప్రయాణం
రైలు రిజర్వేషన్ మీరు రైల్లో ప్రయాణించాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఏదైనా ప్లాట్ ఫారమ్ టికెట్ తో రైలు ఎక్కొచ్చు. దీని తర్వాత మీరు టికెట్ కలెక్టర్ వద్దకు వెళ్లి మీరు ఎక్కడికి వెళ్లాల్లో చెప్పి దానికి తగ్గ డబ్బు చెల్లించి.. టికెట్ పొందవచ్చు. ఈ నిబంధనను (ఇండియన్ రైల్వే రూల్స్) రైల్వే బోర్డ్స్ రూపొందించాయి. అయితే ఇందుకోసం ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ తీసుకుని వెంటనే టీటీఈని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు రైల్లో ఉండే టీటీఈ మీ గమ్యస్థానం వరకు టిక్కెట్‌ను ఇస్తారు.
సీటు లేకపోయినా ప్రయాణించవచ్చు!
రైలులో సీటు ఖాళీగా లేని సందర్భాలు బోలెడు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో TTE మీకు రిజర్వ్ సీటు ఇవ్వడానికి నిరాకరించవచ్చు. కానీ, ప్రయాణాన్ని మాత్రం ఆపలేరు. రైల్లో రిజర్వేషన్ లేకుండా మీరు ట్రైన్ ఎక్కినట్లయితే.. రూ. 250 అపరాధ రుసుముతో (ఫైన్) పాటు ప్రయాణానికి సంబంధించిన మొత్తం ఛార్జీని చెల్లించి టీటీఈ నుంచి టికెట్ పొందవచ్చు. ఈ నిబంధన సామాన్యుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ రూల్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
(నోట్: ఈ సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు రైల్వే అధికారులను సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
ALso Read: Virtual Reality: రూ.800 ఖర్చుతో ఇంట్లోనే 3D సినిమాలను చూసేయోచ్చు.. అదెలాగో తెలుసా?
Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. రూ.3,900 పెరిగిన బంగారం ధర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook