Gold Rate Today: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. రూ.3,900 పెరిగిన బంగారం ధర!

Gold Rate Today: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అత్యధికంగా రూ. 3,900 ధర పెరిగింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 12:20 PM IST
Gold Rate Today: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. రూ.3,900 పెరిగిన బంగారం ధర!

Gold Rate Today: దేశంలో ఈరోజు (ఏప్రిల్ 14) బంగారు ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 100 గ్రాములపై రూ. 3,900 లకు మేర పెరిగింది. దీంతో పాటు 22 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములపై రూ. 3,500లు ఎక్కువగా ఉంది. దీంతో దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 53,500 మార్క్ కు చేరువైంది. 

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్‌లోని డేటా ప్రకారం.. ఈరోజు (ఏప్రిల్ 14) భారతదేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,350 ఉండగా..  24-క్యారెట్‌ల 10 గ్రాములు బంగారం ధర రూ. 53,840 వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

దేశవ్యాప్తంగా బంగారం ధరలు

దేశంలోని వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరలను goodreturns.in నుంచి గ్రహించాం. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,840 వద్దకు చేరుకుంది. దీంతో పాటు ఆర్థిక రాజధాని ముంబయిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,350.. 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 53,840 గా ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 53,840.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,350 వద్దకు చేరుకుంది. మరోవైపు విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారాన్ని రూ. 49,350 గా ఉండగా.. 24 క్యారెట్ల మేలిమి బంగారాన్ని రూ. 53,840 ధరకు విక్రయిస్తున్నారు. 

ALso Read: Flipkart Moto G22: ఫ్లిప్ కార్ట్ లో రూ.549 లకే Moto G22 స్మార్ట్ ఫోన్ అమ్మకం!

Also Read: Train Ticket Booking: రైలు ప్రయాణంలో లోయర్ బెర్తు బుక్ చేసుకోవాలంటే ఇలా చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News