Budget 2023 Expectations: బడ్జెట్‌లో హోమ్ లోన్ వడ్డీపై మినహాయింపు ఉంటుందా, ఈఎంఐ తగ్గే అవకాశాలు
Budget 2023 Expectations: రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహమిచ్చేందుకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో కీలక ప్రకటన చేయవచ్చు. ఇంటి కొనుగోలుదారులు శుభవార్త వినవచ్చు. ఈ బడ్జెట్‌లో హోమ్ లోన్ వడ్డీపై రిబేట్ పెరగవచ్చని అంచనా.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ అంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ విషయంలో రియల్ ఎస్టేట్ రంగం చాలా ఆశలు పెట్టుకుంది. ఈ రంగానికి ప్రోత్సాహమిచ్చేందుకు బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఉండవచ్చని అంచనా. ఆ వివరాలు మీ కోసం..
రియల్ ఎస్టేట్ రంగానికి ఈసారి బడ్జెట్‌లో సముచిత స్థానం లభించే అవకాశాలు కన్పిస్తన్నాయి. అదే సమయంలో ఇంటి కొనుగోలుదారులకు లాభం కలగవ్చు. ఎందుకంటే ఈసారి బడ్జెట్‌లో హోమ్ లోన్ వడ్డీపై లభించే ఇన్‌కంటాక్స్ మినహాయింపును పెంచేందుకు కేంద్రం ఆలోచిస్తోంది. ఫలితంగా డెవలపర్స్, హోమ్ పర్చేజర్స్ ఇరువురికీ లాభం కలగనుంది. ఆ ప్రయోజనాలు ఏంటనేది తెలుసుకుందాం..
వడ్డీపై పెరగనున్న పరిమితి
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి డిమాండ్స్ ఉన్నాయి. ఈ రంగానికి ఇంకా ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరముంది. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా ఇంటి కొనగోలుదారులకు లబ్ది చేకూరేలా నిర్ణయం తీసుకోవచ్చు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగేలా ట్యాక్స్ డిడక్షన్‌లో మార్పు తీసుకురావచ్చు. ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో ట్యాక్స్ డిడక్షన్ పరిమితిని పెంచవచ్చు. అంటే సెక్షన్ 80 సి ప్రకారం ఎక్కువ మినహాయింపు లభించనుంది. ఈ పరిమితిని పెంచి 5 లక్షలు చేయవచ్చని అంచనా.
జీడీపీలో కీలక వాటా
రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన నిపుణుల అంచనాల ప్రకారం జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగానిది కీలకమైన పాత్రగా ఉంటుంది. దేశంలోని రియల్ ఎస్టేట్ రంగం ఉద్యోగాలు కల్పించే విషయంలో రెండవస్థానంలో ఉంది. ఈ రంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 200 కంటే ఎక్కువ పరిశ్రమలు లబ్ది పొందుతున్నాయి. మహమ్మారి కారణంగా ఈ రంగానికి తీవ్రమైన దెబ్బ తగిలింది. అందుకే ఈ రంగాన్ని ఆదుకునేందుకు బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు ఉండవచ్చు.
హోమ్ లోన్ ఈఎంఐ మారనుందా
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో ట్యాక్స్ మినహాయింపు పరిమితిని పెంచవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఇంటి కొనుగోలుదారులకు ప్రయోజనం కలగనుంది. ట్యాక్స్ మినహాయింపు లభించడం వల్ల ఈఎంఐ కూడా తగ్గే అవకాశాలున్నాయి.
Also read: 500 Rupees note: ఇవాళే బడ్జెట్, మార్కెట్‌లో ఉన్న 500 రూపాయల నోటుపై కీలక ప్రకటన, వాస్తవమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook