500 Rupees note: ఇవాళే బడ్జెట్, మార్కెట్‌లో ఉన్న 500 రూపాయల నోటుపై కీలక ప్రకటన, వాస్తవమేంటి

500 Rupees note: కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు అనంతరం వివిధ సందర్భాల్లో వివిధ రకాల వార్తలు వెలుగులోకొచ్చాయి. ఈ నేపధ్యంలో మీ దగ్గర 500 రూపాయల నోటుంటే..కచ్చితంగా ఇది మీకు పనికొచ్చే అంశమే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 1, 2023, 06:33 AM IST
500 Rupees note: ఇవాళే బడ్జెట్, మార్కెట్‌లో ఉన్న 500 రూపాయల నోటుపై కీలక ప్రకటన, వాస్తవమేంటి

కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు అమలు చేసి చాలా కాలమైంది. అప్పటి నుంచి వేర్వేరు సందర్బాల్లో వేర్వేరు వార్తలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ కరెన్సీపై పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఒకవేళ మీ వద్ద 500 రూపాయల నోటుంటే..ఈ వార్త కచ్చితంగా మీ కోసమే.

మార్కెట్‌లో 2 రకాల 500 నోట్లు

మార్కెట్‌లో ప్రస్తుతం 2 రకాల 500 రూపాయల నోట్లు చెలామణీలో ఉన్నాయి. రెండింటిలోనూ చాలా తేడా ఉంది. ఈ రెండింట్లోనూ ఒకటి నకిలీ కావడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ నోటును నకిలీదిగా అభివర్ణిస్తున్నారు. రెండింట్లో ఏది అసలైంది ఏది కాదో తెలుసుకుందాం..

మార్కెట్‌లో లభించే 500 రూపాయల నోటులో పచ్చని పట్టీ ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉండే చోటులో ఉంటుంది లేదా గాందీ బొమ్మ క్లోజ్‌గా ఉంటుంది. ఇలాంటి నోటు నకిలీ అని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారమౌతోంది. పీఐబీ ఈ వ్యవహారంలో ఫ్యాక్ట్ చెక్ చేసింది. అసలు విషయమేంటని నిర్ధారణ చేసింది.

పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అనంతరం సోషల్ మీడియాలో ప్రచారమౌతున్న అంశాలు ఫేక్ అని నిర్ధారణైంది. మార్కెట్‌లో లభించే రెండు నోట్లు అసలైనవేనని తేలింది. మార్కెట్‌లో ఉన్న రెండు రకాల 500 నోటు అసలైందేనని ఆర్బీఐ వెల్లడించింది.

వైరల్ వార్తల నిర్ణారణ ఎలా

మీకు ఏదైనా మెస్సేజ్ లేదా వీడియో వచ్చినప్పుడు వాటిని నమ్మవద్దు. నకిలీ వార్తల్ని ఎవరికీ షేర్ చేయవద్దు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే వివిద వార్తలు నకిలీవో కాదో తేల్చవచ్చు. దీనికోసం అధికారిక వెబ్‌సైట్ https://factcheck.pib.gov.in/ లేదా 8799711259 కు మిస్డ్ కాల్ లేదా  pibfactcheck@gmail.com మెయిల్ చేయడం ద్వారా నిర్ధారించుకోవచ్చు.

Also read: OPPO Reno 8T 5G: అద్దిరిపోయే ఫీచర్స్‌తో ఒప్పో రెనో 8T 5G వచ్చేస్తోంది.. లాంచింగ్ డేట్ ఇదిగో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo

Trending News