అనాదిగా ఉన్న ఈ సాంప్రదాయాన్ని నాటి ఆర్ధిక మంత్రి ఒకే ఒక్క ఉదుటున మార్చేశారు. నాడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు సైతం ఆహ్వానించాయి. హర్షించాయి. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 5వసారి తన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇది ఆమెకు ఓ రికార్డు. ఓ మహిళా ఆర్ధికమంత్రి ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కానీ రెండు దశాబ్దాలు వెనక్కి తిరిగి చూస్తే..అప్పట్లో బడ్జెట్ సాయంత్రం వేళ ప్రవేశపెట్టే సాంప్రదాయం ఉండేది. కేంద్ర బడ్జెట్‌ను సాయంత్రం వేళ ప్రవేశపెట్టే సాంప్రదాయం స్వాతంత్య్రానికి ముందు నుంచీ ఉండేది. రెండు దశాబ్దాల క్రితం వరకూ ఇదే పద్ధతి ఉండేది.  


సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని 2001లో తొలిసారిగా అప్పటి ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా మార్చారు. 2001లో తొలిసారిగా ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక అప్పట్నించి ఇదే కొనసాగుతోంది. ఆ తరువాత యూపీఏ ప్రభుత్వం కూడా ఇదే సాంప్రదాయాన్ని అనుసరించింది. వాస్తవానికి సాయంత్రం సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని దేశంలో బ్రిటీషు సమయం నుంచే వస్తోంది. 


ఎందుకంటే బ్రిటన్‌లో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడుతుంటారు. ఇందులో ఇండియా బడ్జెట్ కూడా ఉండేది. బ్రిటన్‌లో ఉదయం 11 గంటలంటే ఇండియాలో సాయంత్రం 5 గంటలని అర్ధం. అందుకే ఇదే టైమ్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. ఈ పరిస్థితిని 2001లో యశ్వంత్ సిన్హా మార్చారు.


సాధారణ బడ్జెట్‌తోనే రైల్వే బడ్జెట్


మోదీ ప్రభుత్వం ప్రతియేటా ఫిబ్రవరి 28వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం ప్రారంబించింది. బ్రిటీషు కాలం నుంచి వస్తున్న మరో సాంప్రదాయాన్ని మార్చింది. వేర్వేరుగా ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం ఏకం చేసేసింది. సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను కలపడం ప్రారంభమైంది.


Also read: Union Budget 2023 Live updates: మరి కాస్సేపట్లో కేంద్ర బడ్జెట్, సంసద్, దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook