Union Budget 2023: 8వ వేతన సంఘం ఉంటుందా లేదా, ఉద్యోగుల జీతం పెంపుపై కీలక ప్రకటన
Union Budget 2023: కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్..ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేపెట్టనున్నారు. దేశంలోని లక్షలాది ఉద్యోగులు ఈ బడ్జెట్ ప్రకటనపై దృష్టి సారించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి రోజులు రానున్నాయి. ఆర్ఖిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఉద్యోగుల జీతాలు పెంచే ప్రకటన వెలువడనుంది. ఈసారి బడ్జెట్‌లో 8వ వేతన సంఘం ప్రకటించడమో లేదా ఆ స్థానంలో కొత్త వ్యవస్థ ఏర్పాటో జరగవచ్చు.
8వ వేతన సంఘం అంటే
రాజకీయ విశ్లేషణల ప్రకారం దేశంలో వచ్చే ఏడాది ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ప్రభావం చూపిస్తుంది. ప్రభుత్వం ఈ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నాలు చేయవచ్చు. ఎన్నికలకు ముందే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచే విషయమై కీలక ప్రకటన జారీ చేయవచ్చు.
జీతాల పెంపుకై కొత్త వ్యవస్థ
ఇప్పటికే ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘం ప్రకటనకై డిమాండ్ చేస్తున్నాయి. గతంలో 7వ వేతన సంఘంలో ఉద్యోగులకు శాలరీ హైక్ తక్కువే లభించింది. ఈసారి ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఆటోమేటిక్ వ్యవస్థ ఏర్పాటుకు యోచిస్తోంది. ఎలాంటి వ్యవస్థ అంటే..దీనిద్వారా ఉద్యోగులకు జీతాలు ప్రతి యేటా వాటంతటవే రివైజ్ అయ్యేట్టు. దీనికోస బడ్జెట్‌లో కీలక ప్రకటన రావచ్చు.
ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో 8వ వేతన సంఘం ప్రకటించకుండా ఆ స్థానంలో ప్రైవేట్ రంగ ఉద్యోగుల్లా కొత్త ఇంక్రిమెంట్ ఇచ్చే అవకాశాలున్నాయి. దీనికోసం ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేయవచ్చు. కొత్త వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఏ విధమైన ప్రతిపాదన తమవద్ద లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. అంటే ఈసారికి కూడా 8వ వేతన సంఘం లేనట్టే.
దాదాపు 8 ఏళ్ల క్రితం 7వ వేతన సంఘం ఏర్పాటై ఉద్యోగులకు చాలా ప్రయోజనాలు కల్పించారు. ఈ పథకం కింద ఉద్యోగులకు కరవు భత్యం 6 నెలల్లో రివైజ్ అవుతుంది. దాంతో ఉద్యోగుల జీతం పెరుగుతుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం కొత్త వ్యవస్థ ఏర్పాటు ద్వారా కరవు భత్యం దానికదే పెరిగేట్టు చేయవచ్చు.
Also read: Maruti Baleno: మారుతి బలేనో కొంటున్నారా, డౌన్‌పేమెంట్, ఈఎంఐ ఎంత చెల్లించాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook