Maruti Baleno: మారుతి బలేనో కొంటున్నారా, డౌన్‌పేమెంట్, ఈఎంఐ ఎంత చెల్లించాలి

Maruti Baleno: మారుతి కంపెనీ ఉత్పాదనైన మారుతి సుజుకి బలేనో అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. ఈ కారును లోన్ ద్వారా కొనాలనుకుంటే..ఎంత డౌన్‌పేమెంట్ చెల్లించాలి, ఎంత ఈఎంఐ పడుతుందనే వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 30, 2023, 03:32 PM IST
Maruti Baleno: మారుతి బలేనో కొంటున్నారా, డౌన్‌పేమెంట్, ఈఎంఐ ఎంత చెల్లించాలి

మారుతి సుజుకి బలేనోను మీరు లోన్ ద్వారా తీసుకునే ఆలోచన ఉండి..1.5 లక్షలు డౌన్‌పేమెంట్ కడితే..ఐదేళ్ల కాలవ్యవధికి ఈఎంఐ ఎంత చెల్లించాల్సి ఉంటుందో తెలుసా.. ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మారుతి నుంచి వచ్చిన మారుతి బలేనో ఇటీవల అత్యధికంగా విక్రయమయ్యే కారుగా ఉంది. మారుతి కార్లలో బాగా పాపులర్ మోడల్ ఇది. మారుతి బలేనో కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా మారుతి బలేనో కొనాలనుకుంటే..డౌన్‌పేమెంట్ ఈఎంఐ ఎంత అనేది తెలుసుకోలేకపోతే మేం మీకు ఆ వివరాలు అందిస్తాం. ఒకవేళ మీరు డౌన్‌పేమెంట్‌లో భాగంగా 1.5 లక్షలు చెల్లిస్తే..ఐదేళ్లకు ఎంత ఈఎంఐ చెల్లించాల్సి వస్తుందో..లెక్కగడదాం..

మారుతి సుజుకీ బలేనో వేరియంట్ కారు ఎక్స్ షోరూం ధర 6.56 లక్షల రూపాయలు. ఆన్‌రోడ్ అయితే దాదాపుగా 7.44 లక్షల రూపాయలు. దీనికి మీరు డౌన్‌పేమెంట్‌గా 1.5 లక్షలు కడితే..లోన్ నగదు దాదాపుగా 5.94 లక్షల రూపాయలుంటుంది. ఈ రుణాన్ని ఐదేళ్లకు తీసుకుంటే..వడ్డీ 9.8 శాతం లెక్కిస్తారు. అంటే మొత్తం 7.54 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. ఇందులో 1.59 లక్షల రూపాయలు వడ్డీ అవుతుంది. ఇక మీ ఈఎంఐ వచ్చేసరికి కేవలం 12, 577 రూపాయలే అవుతుంది. 

మారుతి సుజుకి బలేనో ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ అయింది. ఇందులో చాలా ఫీచర్లున్నాయి. ముఖ్యంగా 360 డిగ్రీస్ కెమేరా, హెడ్ అప్ డిస్‌ప్లే,రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇందులో రేర్ ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్‌బి పోర్ట్ కూడా ఉంది. కారులో ఎల్ఈడీ ఫాగ్ లెన్స్, కొత్త డిజైన్ ‌కూడిన ఎల్ఈడీ ప్రోజెక్ట్ హెడ్‌లైట్స్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 9 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్‌ఫో‌టైన్‌మెంట్ సిస్టమ్, రేర్ వ్యూ కెమేరా, వైర్‌లెస్ ఛార్జర్ ఉన్నాయి.

Also read: Hindenburg Research: మోసం మోసమే అవుతుంది..దేశభక్తి ముసుగులో కప్పిపుచ్చడం సాధ్యం కాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News