5G Spectrum Auction: దేశంలో 5 జి స్పెక్ట్రమ్ వేలం జూలైకు పూర్తి, ఆమోదించిన కేంద్ర కేబినెట్
5G Spectrum Auction: దేశంలో 5జీ సేవలకు మార్గం సుగమమవుతోంది. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 2022 నాటికి వేలం పూర్తి కానుంది.
5G Spectrum Auction: దేశంలో 5జీ సేవలకు మార్గం సుగమమవుతోంది. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 2022 నాటికి వేలం పూర్తి కానుంది.
ఇండియాలో 5 జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ అనుమతిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో 20 ఏళ్లపాటు చెల్లుబాటయ్యే వ్యవధితో మొత్తం 72097.85 ఎంహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్ వేలం జూలై నాటికి పూర్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు. 5జీ సేవలు అందుబాటులో వస్తే..అభివృద్ధి మరింతగా జరగనుందని నిపుణులు చెబుతున్నారు.
డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలకు డిజిటల్ కనెక్టివిటీ ప్రధానాంశంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో 80 కోట్లమంది 4జి బ్రాడ్ బ్యాండ్ సేవలు పొందుతున్నారు. 2014లో ఈ సంఖ్య కేవలం 10 కోట్లుంది. 5 జీ సేవల ప్రారంభంతో దేశంలో అన్ని రంగాల్లో ఆ ప్రభావం స్పష్టంగా కన్పిస్తుందని..ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Also read: Oppo K10 5G: రూ. 17వేల విలువ చేసే ఒప్పో 5G ఫోన్ ఇప్పుడు కేవలం రూ.3 వేలకే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook