Upcoming Best 3 Suv Cars 2024: రోజురోజుకు భారత మార్కెట్‌లో మైక్రో SUV డిమాండ్‌ విపరీతంగా పెరుగుతూ వస్తోంది. చాలా మంది మిడిల్‌ క్లాస్‌ కస్టమర్స్‌ మిడ్‌ రేంజ్‌లో లభించే మైక్రో SUVలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆటో మొబైల్‌ కంపెనీలు కూడా ఇలాంటి కార్లనే ఎక్కువగా లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ఎప్పటి నుంచో మంచి మైక్రో SUV కారును కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే మార్కెట్‌లోకి మరికొన్ని కంపెనీల నుంచి ఎస్‌యూవీలు విడుదల కాబోతున్నాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే లాంచ్‌ అయిన టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్ల  విక్రయాలు టాప్‌లో ఉండడంతో కొన్ని కంపెనీలు త్వరలోనే కార్లను విడుదల చేయబోతున్నాయి. అయితే ఈ కార్లకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హ్యుందాయ్ ఇన్‌స్టర్:
ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హ్యుందాయ్ ఇటీవలే జరిగిన మొబిలిటీ షో 2024లో భాగంగా త్వరలోనే లాంచ్‌ కాబోయే ఆల్-ఎలక్ట్రిక్ ఇన్‌స్టర్‌ వేరియంట్‌ కారును కూడా కంపెనీ వెల్లడించిన సంగతి అందిరికీ తెలిసిందే. ఈ హ్యుందాయ్ ఇన్‌స్టర్ కారు ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఈ కారు ఒకే ఛార్జ్‌ చేస్తే దాదాపు  355 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. దీంతో పాటు కంపెనీ దీనిని మైక్రో ఎలక్ట్రిక్ SUV విభాగంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫీచర్స్‌ కూడా ఇటీవలే లీక్‌ అయ్యాయి. 


మారుతీ సుజుకి Y43:
భారత్‌లో టాటా కంపెనీ తర్వాత అత్యధికంగా విక్రయిస్తున్న కార్ల సంస్థల్లో మారుతి సుజుకి ఒకటి. ఈ మారుతి కంపెనీ కూడా త్వరలోనే కొత్త మైక్రో SUVని అందుబాటులోకి తీసుకు రానుంది. దీనిని కంపెనీ మారుతీ సుజుకి Y43 పేరుతో అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ కారు మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే టాటా పంచ్‌తో పాటు హ్యుందాయ్ ఎక్సెటర్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని కంపెనీ 1.2-లీటర్ Z-సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన కొన్ని వివరాలను కంపెనీ వెల్లడించింది. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్:
టాటా మోటర్స్‌ను త్వరలోనే ఇటీవలే అత్యధికంగా అమ్ముడుపోయిన టాటా పంచ్ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌లో అందుబాటులోకి రానుంది. ఇది అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. టాటా కంపెనీ ఇటీవలే ఈ పంచ్‌ కారును ఎలక్ట్రిక్ వేరియంట్‌లో కూడా విడుదల చేసిన సంగతి అందిరికీ తెలిసిందే. దీనిని మార్కెంట్‌లో మంచి గుర్తింపు రావడంతో చాలా మంది ఈ కారును కొనుగోలు చేసేందుకు ఎక్కువగా అసక్తి చూపారు. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి