Arizor Wires: ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల రంగంలో అగ్రగామిగా ఉన్న వి-గార్డ్ సంస్థ నుంచి అరిజో వైర్స్ (తీగలు)ను ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి వి-గార్డ్ అరిజో వైర్స్‌ను ఆవిష్కరించింది. అడ్వాన్స్ డ్ ఇ-బీమ్ టెక్నాలజీ, హాలోజెన్ లేని, తక్కువ పొగ వంటి లక్షణాలు ఆరిజో వైర్స్ సొంతం కావడం విశేషం. విద్యుత్ ప్రమాదాల నుంచి సురక్షితంగా ఈ తీగలు ఉంటాయి. భద్రత, సుస్థిరత ప్రమాణాల విషయంలో కొత్త శకానికి అరిజో తీగలు నాంది పలుకుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rameshwaram Cafe: కీలక మలుపు.. రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టినోడు, ప్లాన్‌ వేసినోడు ఇద్దరూ అరెస్ట్‌


 


భారతీయ హౌజింగ్ వైర్స్, కేబుల్స్ మార్కెట్ వృద్ధి చెందుతూ 9%-10% వృద్ధి రేటుతో 22- 25,000 కోట్ల రూపాయలను చేరుకోనున్నదని అంచనాలు వెలువడుతున్నాయి. సురక్షితమైన, పర్యావరణహితమైన పరిష్కారాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తన అధునాతన, అద్భుతమైన ఈ-బీమ్ ప్రాసెసింగ్ టెక్నిక్‌తో 'అరిజో వైర్స్' ఈ డిమాండ్‌ను అధిగమిస్తుందని వీ గార్డ్‌ పేర్కొంది. సాంప్రదాయకమైన ఎఫ్ఆర్ పీవీసీ వైర్లతో పోలిస్తే 75% అధికంగా కరెంటును తీసుకువెళ్లగల సామర్థ్యాన్ని అరిజో వైర్స్ కలిగి ఉంటుందని వెల్లడించింది.

Also Read: Loksabha Elections 2024: మొదటిసారి ఈవీఎంను ఎక్కడ వినియోగించారు..? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా..!


 


ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అరిజో వైర్స్ ఎలక్ట్రికల్, భౌతిక సామర్థ్యం రెండింటినీ ద్విగుణీకృతం చేస్తోందని వీ గార్డ్‌ తెలిపింది. ఉష్ణ నిరోధక, మెల్ట్  రెసిస్టెంట్, అగ్ని నిరోధకంగా అరిజో వైర్స్ రూపొందించారు. షార్ట్ సర్క్యూట్ల బెడద, అగ్ని ప్రమాదాలు తగ్గించనుండడంతో గృహాలు, వ్యాపార సముదాయాలకు ప్రమాదాల బెడద లేదు. అరిజో  వైర్లు లెడ్ రహిత, కాన్యర్ కారకాలు లేని ముడిపదార్ధాలతో ఆర్ఓహెచ్ఎస్, ఆర్ఈఏసీహెచ్ ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేయబడతాయి. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సులేషన్ నుంచి విషవాయువులు వెలువరించకపోవడంతో 'అరిజో' తీగలు మరో ప్రత్యేకత. అరిజో వైర్స్ పర్యావరణహితమైనవే కాదు, వినియోగదారులకు చక్కటి భద్రతను అందిస్తాయి.


ఈ తీగలకు మరో ప్రత్యేకత కూడా కలిగి ఉంది. తేమను తుడిచిపెట్టే దీని పైకవచం వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా దీర్ఘకాలం మన్నికగా ఉండేలా చేస్తుంది. చెదలు, ఎలుకలు కూడా ఈ తీగలను పాడుచేయలేదు. అరిజో వైర్స్ మన్నిక, సుదీర్ఘకాలం దెబ్బతినకుండా ఉంటుంది. అరిజో వైర్స్ ఆవిష్కరణ సందర్భంగా వి-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్, సీఓఓ వి. రామచంద్రన్ మాట్లాడుతూ తీగల ప్రత్యేకతలు వివరించారు. 'ఎలక్ట్రికల్ భద్రత, సుస్థిరత విషయంలో ముందు వరసలో నిలబడే అరిజో వైర్స్‌ను ప్రవేశపెడుతుండడం సంతోషంగా ఉంది. అరిజో వైర్స్ ద్వారా మేము సురక్షితమైన ఉత్పత్తిపై పెట్టుబడి పెడుతున్నందుకు సంతోషిస్తున్నాం' అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook