ఏదైనా వస్తువు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండే దేశం..అదే వస్తువును దిగుమతి చేసుకుంటే ఆశ్చర్యమే కదా.. అదే జరిగింది. వియత్నాం దేశం..ఇండియా నుంచి బియ్యం కొనుగోలు చేయడం విశేషంగా మారుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బియ్యం ఎగుమతుల్లో ప్రపంచంలోనే వియత్నాం ( Vietnam ) దేశానికి మూడవ స్థానం. అటువంటిది తొలిసారిగా ఇండియా నుంచి బియ్యం కొనుగోలు ( Rice purchase ) చేస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా వియత్నాం బియ్యం దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి. ఆసియా దేశాల్లో ఆహార ఉత్పత్తుల సరఫరా తగ్గుతున్న నేపధ్యంలో ఈ పరిణామం జరిగినట్టు భావిస్తున్నారు. ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి.


సాధారణంగా బియ్యం ఉత్పత్తి ( Rice production ) లో థాయ్‌లాండ్ ( Thailand ), వియత్నాం దేశాలు ముందుంటాయి. కానీ ఇటీవలి కాలంలో వియత్నాంలో ధరలు పెరగడంతో..ఇండియాపై ఆధారపడాల్సి వచ్చిందని రైస్ ఎక్స్‌పోర్టర్స్ సంఘం తెలిపింది. టన్ను బియ్యం 310 డాల‌ర్ల‌ చొప్పున ఎగుమతి చేసేలా డీల్ కుదిరిందని భారతీయ రైస్ డీలర్ తెలిపారు. వియత్నాంకు బియ్యం పంపడం తొలిసారి అని ఆయన చెప్పారు. ఇండియాలో లభించే బియ్యం తక్కువ ధర పలుకుతోందని..అందుకే ఎగుమతులు పెరిగాయని అన్నారు. కరోనా మహమ్మారి ( Corona pandemic ) కారణంగా వియత్నాంతో పాటు..ఇతర ఆసియా దేశాలిప్పుడు ఆహార ధాన్యాల్ని నిల్వ చేసుకునే పనిలో పడ్డాయి. దాదాపు 3 లక్షల టన్నుల బియ్యాన్ని నిల్వ చేసుకుంది. 


Also read: దేశంలో అత్యధికంగా అమ్మకం జరిగే బైక్ Splendor విశేషాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook