Volkswagen vs Honda City: దేశంలో చాలా రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. సెడాన్, నాన్ సెడాన్, ఎస్‌యూవీ, మిడ్‌సైజ్ ఎస్‌యూవీ, 7 సీటర్, 8 సీటర్ ఇలా విభిన్నమైన కార్లు వివిధ రకాల కంపెనీలవి పోటీ పడుతున్నాయి. ఇప్పుడు వోక్స్‌వేగన్ ప్రవేశపెట్టిన కారు హోండా సిటీతో పోటీ పడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వోక్స్‌వేగన్ ఇండియా కంపెనీ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన డిజైన్, ప్రత్యేకతలు, జర్నీ కంఫర్ట్ విషయంలో వోక్స్‌వేగన్ కారుతో మరే కారును పోల్చలేం. వోక్స్‌వేగన్ ఇండియా గత ఏడాది మార్చ్ నెలలో మిడ్‌సైజ్ సెడాన్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏడాది తరువాత మిడ్‌సైజ్ సెడాన్ 1.5 టీఎస్ఐ వేరియంట్‌లో 6 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో తీసుకొచ్చింది. కొత్త 1.5 టీఎస్ఐ మేన్యువల్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర 16.89 లక్షల రూపాయల నుంచి ప్రారంభమౌతుంది. వోక్స్‌వేగన్ వర్చూస్‌లో కొత్త జీటీ ఎడ్జ్ లిమిటెడ్ కలెక్షన్ వేరియంట్ కూడా ఇచ్చేశారు. 


వోక్స్‌వేగన్ వర్చూస్ కొత్త మేన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 1.5 టీఎస్ఐ వేరియంట్ ఉంటుంది. ఈ కారు ధర 16 లక్షల 89 వేల నుంచి మొదలౌతుంది. ఇందులోనే జీటీ ఎడ్జ్ లిమిటెడ్ వెర్షన్ అయితే 17 లక్షల 9 వేల నుంచి ప్రారంభమై 18 లక్షల 76 వేల మధ్యలో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రస్తావిస్తున్న ధరలన్నీ ఎక్స్ షోరూం ధరలే. రోడ్ ట్యాక్స్ ఇతర ఛార్జీలు అదనంగా ఉంటాయి. వోక్స్‌వేగన్ వర్చూస్ కారు మార్కెట్‌లో ఉన్న స్కోడా స్లోవియా, హోండా సిటీ, హ్యుండయ్ వెర్నా వంటి కార్లకు పోటీగా ఉంది. మరీ ముఖ్యంగా ఎవర్ గ్రీన్ కారుగా చెప్పుకునే హోండా సిటీని దీటుగా ఎదుర్కొంటోంది.


వోక్స్‌వేగన్ వర్చూస్ కారును రెండు టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లతో ప్రవేశపెట్టారు. ఇందులో 1.0 లీటర్ టీఎస్ఐ ఇంజన్ ఉంది. ఇది 113 బీహెచ్‌పి, 178 ఎన్‌ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా 6 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో వస్తోంది. ఇందులో 1.5 లీటర్ టీఎస్ఐ ఇంజన్ ఆప్షన్ ఉండటం మరో ప్రత్యేకత. ఇది 148 బీహెచ్‌పీ, 250 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిని 6 స్పీడ్ ఎంటీ, 7 స్పీడ్ డీఎస్జీతో అనుసంధానించారు. 


వోక్స్‌వేగన్ వర్చూస్‌లో 10.1 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, టేల్ ల్యాంప్స్ 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 స్పీకర్ ఆడియో, హైట్ ఎడ్జస్టెబుల్ డ్రైవింగ్ సీట్, పవర్ ఎడ్జస్టెబుల్ ఓఆర్‌వీఎమ్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 


Also read: Best SUV Cars: దేశంలో 10 లక్షల కంటే తక్కువకు లభించే టాప్ 10 ఎస్‌యూవీ కార్లు ఇవే 6 లక్షలకే ఎస్‌యూవీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook