Vu 43 Inch Smart TV Flipkart Offer: భారత టెలివిజన్​ మార్కెట్​ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పటిలా కాకూండా.. స్మార్ట్ టీవీలను ఉపయోగించే విధానం ఎక్కువైంది. దాదాపు ప్రతి ఇంట్లో స్మార్ట్ ​టీవీలు దర్శనమిస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత థియేటర్లకు వెళ్లడం తగ్గడంతో..  చాలా మంది స్మార్ట్ ​టీవీల్లోనే ఎంటర్​టైన్​మెంట్​ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలు, వెబ్ ​సిరీస్​లు, యూట్యూబ్​, క్రికెట్ ఇలా అన్ని స్మార్ట్ ​టీవీల్లోనే చుస్తునారు. అందుకే పలు స్మార్ట్ టీవీ సంస్థలు కూడా తక్కువ బడ్జెట్ ధరలోనే టీవీలను అందిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షావోమి, ఎల్‌జీ, సామ్‌సంగ్, వీయూ, టీసీఎల్ వంటి కంపెనీలు తక్కువ బడ్జెట్ ధరలోనే 32, 40, 43, 50, 55, 60, 65 ఇంచ్ స్మార్ట్ ​టీవీలను మార్కెట్లోకి లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే 'వీయూ' 43 ఇంచ్ టీవీని సామాన్యులకు కూడా అందుబాటులో ధరలో ఉంచింది. భార‌త మార్కెట్లో వీయూ ప్రీమియం 43 ఇంచ్ టీవీ అసలు ధర రూ. 45, 000లుగా ఉంది. అయితే ప్రముఖ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీపై అదిరే ఆఫర్ ఉంది. 'డీల్స్ ఆఫ్ ది డే'లో భాగంగా వీయూ ప్రీమియం 43 ఇంచ్ టీవీ 42 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో 19,010 తగ్గింపుతో.. ఈ స్మార్ట్ టీవీ రూ. 25,990లకు అందుబాటులో ఉంది. 


వీయూ ప్రీమియం 43 ఇంచ్ టీవీపై బ్యాంక్ ఆఫర్‌ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ఆక్సిస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 16,900 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. రూ. 25,990 వీయూ ప్రీమియం 43 ఇంచ్ టీవీని కేవలం రూ. 9,000లకి సొంతం చేసుకోవచ్చు. అయితే మీ పాత స్మార్ట్‌ టీవీ కండిషన్ బాగుంటేనే రూ. 16,900 వస్తాయి. 


వీయూ ప్రీమియం టీవీ స్పెసిఫికేషన్లు:
# 43 ఇంచ్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ
# 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమోరీ
# ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
# అల్ట్రా హెచ్‌డీ 3840 x 2160  పిక్సల్స్ 
# 30 వాట్ల సౌండ్ అవుట్ పుట్
# రిఫ్రెష్ రేట్ 60 Hz


Also Read: Neha Sharma Pics: బ్రాలో నేహా శర్మ హాట్ ట్రీట్.. క్లోజప్‌గా అందాలన్నీ చూపిస్తూ..!


Also Read: బ్లాక్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ.. అమ్మడి గ్లామర్ ట్రీట్‌కు కుర్రకారు ఫిదా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.