Insta Loan on WhatsApp: వాట్సాప్ వచ్చిన తరువాత ఎన్నో పనులు సులభతరం అయ్యాయి. సందేశాలు పంపించుకోవడమే కాకుండా.. ఫోటోలు, వీడియోలు, లొకేషన్ వాటిని పంపించడం ఈజీ అయిపోయింది. అంతేకాకుండా ఫైల్స్ సెండ్ చేసుకోవడంతోపాటు ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడేందుకు కూడా ఎంతో ఉపయోగపడుతోంది. అదేవిధంగా వాట్సాప్‌ను ఆర్థిక లావాదేవీల కోసం కూడా ప్రజలు ఉపయోగిస్తున్నారు. మీకు లోన్‌ కావాలన్నా.. వాట్సాప్‌లోనే సేవలు అందుబాటులో ఉన్నాయి. అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వాట్సాప్ నుంచే రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IIFL ఫైనాన్స్ ద్వారా బిజినెస్ లోన్ సులభంగా పొందవచ్చు. ఇక నుంచి వేగంగా రుణాలు అందించేందుకు IIFL ఫైనాన్స్ వాట్సాప్‌లోనే బిజినెస్ లోన్ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌లో తమ కస్టమర్లకు తక్షణ ఆమోదంతో రూ.10 లక్షల వరకు బిజినెస్ లోన్లు ఇస్తామని ప్రకటించింది. వాట్సాప్‌లో IIFL ఫైనాన్స్ బిజినెస్ లోన్ MSME లోన్‌లో మొట్టమొదటిసారిగా ఈ సేవలు ప్రారంభించింది. 100 శాతం లోన్ అప్లికేషన్ డిజిటల్‌గా జరుగుతుందని తెలిపింది. 


వాట్సాప్‌ లోన్ ప్రోడక్ట్ AI-bot ద్వారా అందించనుంది IIFL ఫైనాన్స్  కంపెనీ. ఇది యూజర్ ఇన్‌పుట్‌తో లోన్ ప్రతిపాదనతో సరిపోలుతుంది. అప్లికేషన్‌ను ఈజీగా ప్రాసెస్ చేస్తుంది. వాట్సాప్ వినియోగదారులు IIFL ఫైనాన్స్‌ వాట్సాప్ నంబరుకు 9019702184కు 'హాయ్' అని మెసేజ్ పంపించి.. లోన్ పొందవచ్చు. మీకు అవసరమైన డబ్బును ఎలాంటి పేపర్లు సమర్పించకుండానే.. డిజిటల్ ప్రాసెస్‌లో లోన్ పొందవచ్చు. 


వాట్సాప్‌లో ఈజీగా పేపర్‌లెస్ ద్వారా లోన్ ఆఫర్ లోన్ ఆఫర్ చేస్తున్నామని IIFL ఫైనాన్స్‌ బిజినెస్ హెడ్ భరత్ అగర్వాల్ తెలిపారు. లోన్ పొందే ప్రక్రియను తాము మరింత సరళీకృతం చేశామని చెప్పారు. చిన్న వ్యాపారవేత్తలను దృష్టిలో ఉంచుకుని.. వాట్సాప్‌లో బిజినెస్ లోన్ కల్పించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు.


Also Read: CSK Vs GT Dream11 IPL Final Match Dream11 Prediction: ఐపీఎల్ ఫైనల్‌కు వేళయా.. గుజరాత్‌కు చెన్నై చెక్ పెడుతుందా..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇవే..


Also Read: CSK Vs GT IPL 2023: క్షణాల్లో మ్యాచ్‌ మార్చేసే వీరులు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి