Whatsapp New Feature: వాట్సప్‌లో త్వరలో కొత్త ఫీచర్, ఎడిట్ ఆప్షన్‌పై పనిచేస్తున్న మెటా
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెట్టనుంది. అదే జరిగితే ఆ ఫీచర్‌ను ప్రవేశపెట్టే తొలి మెస్సేజింగ్ యాప్ వాట్సప్ కానుంది.
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెట్టనుంది. అదే జరిగితే ఆ ఫీచర్‌ను ప్రవేశపెట్టే తొలి మెస్సేజింగ్ యాప్ వాట్సప్ కానుంది.
సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్స్‌లో బహుళ ప్రాచుర్యం పొందిన యాప్ వాట్సప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూ యూజర్లు చేజారకుండా..కొత్త యూజర్లను ఆకట్టుకుంటోంది. అందుకే వాట్సప్ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది. ఇతర యాప్స్‌లో లేని ఫీచర్లు అందుబాటులో తీసుకొస్తుంటుంది.
ఇప్పటి వరకూ ఏ మెస్సేజింగ్ యాప్‌లో లేని డిలీట్ ఎవ్విర్ వన్ ఆప్షన్ వాట్సప్ కే సొంతం.. అయితే పంపించిన మెస్సేజ్ డిలీట్ చేసి కొత్తది పంపించాల్సి ఉంటుంది. అదే మెస్సేజ్‌లో మార్పులు చేసుకునే అవకాశముంటే నిజంగా అద్భుతమే కదా..ఇప్పుడు వాట్సప్ అదే పనిలో నిమగ్నమైంది. దీనికోసం వాట్సప్ అదనంగా ఎడిట్ ఆప్షన్ తీసుకురానుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్, డెస్క్‌టాప్ బీటా వెర్షన్లలో ఈ కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులో రానుంది. ప్రస్తుతం మెటా ఈ కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఇది కాకుండా మరో ఫీచర్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎవరైనా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయితే..అందరికీ అలర్ట్ కన్పించకుండా కేవలం అడ్మిన్‌కు మాత్రమే తెలిసేలే ఫీచర్ రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook