Flipkart Best offers: ఫ్లిప్‌కార్ట్‌‌లో ఆఫర్ల మోత... రూ.40 వేలు విలువ చేసే ఐఫోన్ సగం కన్నా తక్కువ ధరకే...

Flipkart Offers on APPLE iPhone:  ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల మోత మోగుతోంది. బిగ్ బచత్ ధమాల్ సేల్ కింద స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు అందిస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 2, 2022, 12:07 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి బిగ్ బచత్ ధమాల్ సేల్
    స్మార్ట్ ఫోన్లపై, ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్
    రూ.40 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ.17,999కే
Flipkart Best offers: ఫ్లిప్‌కార్ట్‌‌లో ఆఫర్ల మోత... రూ.40 వేలు విలువ చేసే ఐఫోన్ సగం కన్నా తక్కువ ధరకే...

Flipkart Offers on APPLE iPhone: చౌక ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా... బెస్ట్ ఆఫర్స్ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారా... అయితే ఫ్లిప్‌కార్ట్ మీకు బెస్ట్ ప్లాట్‌ఫామ్. కస్టమర్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ మరోసారి బిగ్ బచత్ ధమాల్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ కింద కేవలం స్మార్ట్ ఫోన్లే కాదు టీవీలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్లపై కూడా భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. దాదాపు రూ.40 వేలు విలువ చేసే యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (Red, 64 జీబీ)ని కేవలం రూ.17,999కే మీ సొంతం చేసుకోవచ్చు. 

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు :

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (Red, 64 జీబీ) సాధారణ ధర రూ.39,900. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 23 శాతం తగ్గింపుతో కేవలం రూ.30,499కే అందుబాటులో ఉంది. అంతేకాదు, దీనిపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ రూపంలో రూ.12,500 వరకు తగ్గింపు లభిస్తోంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే దాని కండిషన్‌ని బట్టి మీకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే... రూ.39,900 విలువ చేసే ఈ ఫోన్‌ని కేవలం రూ.17,999కే కొనుగోలు చేయవచ్చు. 

కస్టమర్స్ గమనించాల్సిన విషయమేంటంటే... ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. బిగ్ బచత్ ధమాల్ సేల్ కింద కేవలం మూడు రోజుల పాటు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. జూన్ 3 నుంచి జూన్ 5 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్‌ని పొందవచ్చు. పూర్తి వివరాలకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌ను సందర్శించండి.  

Also Read: Telangana Formation Day: ఢిల్లీలో తెలంగాణ సంబురం..పాల్గొననున్న అమిత్ షా..!

Also Read: Flipkart Smart Phone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. రూ.23 వేలు విలువ చేసే ఈ శాంసంగ్ ఫోన్ కేవలం రూ.2,499కే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News