Whatsapp New Features: యూజర్ అనుభవాన్ని పెంచేందుకు వాట్సప్ ఎప్పటికప్పుుడు సరికొత్త ఫీచర్లు అందుబాటులో తీసుకొస్తోంది. వాట్సప్‌కు సంబంధించిన ఆరు కొత్త ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్సప్ 2022లో కొత్తగా ఆరు ఫీచర్లు తీసుకొస్తోంది. లాంచ్ చేసే ముందు ఆండ్రాయిడ్, ఐవోఎస్ బీటా వెర్షన్లపై పరిశోధనలు జరిపింది. వాట్సప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్ విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. పంపించిన మెస్సేజ్‌లో మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఒకసారి పంపించిన తరువాత వెంటనే ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే చేయవచ్చు. 


మరో కొత్త వాట్సప్ ఫీచర్ ఛాట్‌లో కన్పించని ముఖ్యమైన మెస్సేజ్‌ను సేవ్ చేసుకునే అవకాశం. కాంటాక్ట్ జాబితాలోంచి, గ్రూప్ ఇన్‌ఫో నుంచి కావల్సిన మెస్సేజ్‌ను సేవ్ చేసుకునేందుకు వీలుగా వాట్సప్ కొత్త సెక్షన్ యాడ్ చేయనుంది. స్టేటస్ అప్‌డేట్ వంటివి బదిలీ చేసేటప్పుడు అవకాశం కల్పించే మరో కొత్త ఫీచర్ తీసుకురానుంది. అంతేకాకుండా స్టేటస్ అప్‌డేట్ కోసం నిర్ణీత ఆడియన్స్ ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తుంది. 


ఇక మరో ముఖ్యమైన ఫీచర్ వాట్సప్ ప్రీమియం. ఇది బిజినెస్ కస్టమర్లకు సబ్‌స్క్రిప్షన్‌పై లభించే సౌలభ్యం. ఈ ఆప్షన్ పది డివైసెస్ వరకూ లింక్ అవుతుంది. వ్యాపారవర్గాలకు దోహదపడుతుంది. ఇక మరో ఫీచర్ గ్రూప్ నుంచి ఎవరికీ అంటే సభ్యులకు తెలియకుండా ఎగ్జిట్ అవడం. కేవలం అడ్మిన్‌కు మాత్రమే తెలుస్తుంది. 


వాట్సప్ ఐవోఎస్ బీటా వెర్షన్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ఆల్బమ్స్‌పై డిటైల్డ్ రియాక్షన్ అవకాశం కలుగుతుంది. మీ ఆల్పమ్ లేదా ఫోటో లేదా వీడియోపై ఎవరైనా రియాక్ట్ అయితే..ఎవరు రియాక్ట్ అయ్యారో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. 


Also read: Hyundai Venue 2022: హ్యుండయ్ వెన్యూ ఇండియాలో లాంచ్ డేట్ ఎప్పుడు, ఫీచర్లేంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook