Whats App New feature: వాట్సప్‌లో నయా ఫీచర్.. అన్ని హైడ్ చేసేయొచ్చు..!!
అనుకున్న వారికి మాత్రమే లాస్ట్ సీన్, స్టేటస్, ప్రొఫైల్ పిక్చర్ లను హైడ్ చేసే ఫీచర్ వాట్సప్ లో లేదు. వాట్సప్ ఈ కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.
వాట్సప్ యాప్ (Whats App)... 180 దేశాలలో, దాదాపు 60 భాషలలో అందుబాటులో ఉన్న ఈ యాప్ 340 మిలియన్ల యూసర్ లు ఉన్నారంటే ఎంత ఫేమసో అర్థమవుతుంది. వాట్సప్ యాప్ యాజమాన్యం కూడా యూసర్ల అవసరాల మేరకు కొత్త కొత్త ఫీచర్లతో ఎల్లపుడు అప్డేట్ చేసుకుంటేనే... కొత్త యూసర్లను ఆకట్టుకుంటుంది.
ఇపుడు మరో కొత్త ఫీచర్ (New Feature in Whats App) లను విడుదల చేసే ప్లాన్ లో ఉంది వాట్సప్ యాజమాన్యం. అదేంటంటే లాస్ట్ సీన్ (Last seen hide in whats app), స్టేటస్ (Hide status in Whats App), ప్రొఫైల్ పిక్చర్ (Hide Profile Pictures in Whats App) లను హైడ్ చేయటం...
Also Read: Anasuya Photos: "జబర్దస్త్" ఫోటోలతో అదరగొడుతున్న యాంకర్ అనసూయ
ఏంటి లాస్ట్ సీన్ హైడ్ ఆప్షన్ ఇది వరకే ఉంది కదా అనుకుంటున్నారా ?? అయితే ఇపుడున్న ఫీచర్ వాట్సప్ అకౌంట్ లో మీ లాస్ట్ సీన్ ఆఫ్ చేస్తే వేరే వాళ్లకి మీ లాస్ట్ సీన్ కనపడదు మరియు వేరే వాళ్ల లాస్ట్ సీన్ మీరు చూడలేరు.
కానీ ఇపుడు వచ్చే ఫీచర్ ఏంటంటే.. చివరి సారి వాట్సప్ యాప్ (Whats App) లాస్ట్ సీన్ ఉపయోగించామో యూజర్లకు తెలియకుండా ఉండేందుకు ఈ ఆప్షన్‌ను హైడ్ చేసుకునేలా ఓ సరికొత్త ఫీచర్ విడుదల చేయనుంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే, అందరికీ లాస్ట్ సీన్ ఆఫ్ చేయటమే కాకుండా ఎంచుకున్న కాంటాక్ట్ లకు మాత్రమే లాస్ట్ సీన్ హైడ్ చేసే అవకాశం కూడా ఉంది.
వీటితో పాటుగా మన వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్ (Whats app Profile picture Hide) మరియు స్టేటస్ (Whats App Status Hide) లను కూడా కనపడకుండా హైడ్ చేసుకునే ఫీచర్ కూడా రాబోతున్నాట్టు సమాచారం.
Aslo Read: Offline UPI Payments: హుర్రే... ఇంటర్నెట్ లేకుండా UPI పేమెంట్స్.. ఎలాగో చూడండి!
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి, మన నంబర్ ఉన్నవారికి మరియు ఎవరికీ కనపడుకుండా మాత్రమే లాస్ట్ సీన్ హైడ్ (Last seen Hide) చేయోచ్చు. కానీ రాబోయే ఫీచర్ తో ప్రత్యేకంగా ఒక వ్యక్తి మాత్రమే కనపడకుండా హైడ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ ఫీచర్ తీసుకురావటానికి వాట్సప్ సెట్టింగులలో (Whats App Settings) మార్పులు చేస్తుందని సమాచారం. ప్రస్తుతం స్టేటస్‌లు(Status), ఫొటోలను (Photos) సెలెక్టేడ్ వ్యక్తులకు కనపడకుండా దాచువటం కుదరదు. ఈ ఫీచర్ కోసం ఆండ్రాయిడ్ (Android), ఐవోఎస్ బీటా వెర్షన్లలో (IOS Beta version ) చెక్ చేస్తున్నారు. అభివృద్ధిలో ఉన్న ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావటానికి వాట్సప్ యాజమాన్యం ప్రయత్నిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook