Wholesale inflation: అక్టోబర్‌లో ఐదు నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
WPI inflation rise again: అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగింది. వరుసగా ఏడో నెల కూడా రెండంకెల పైకి చేరింది.
WPI inflation accelerates to 5-month high: హోల్ సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (WPI Inflation) మరింత పెరిగింది. అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 12.54 శాతానికి పెరిగినట్లు (WPI Inflation in October) వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఇది ఐదు నెలల గరిష్ఠమని తెలిపింది. డబ్ల్యూపీఐ రెండంకెలపైన నమోదవడం వరుసగా ఇది ఏడో సారి కావడం గమనార్హం.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 10.66 శాతంగా (WPI Inflation in September) ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం అత్యల్ప రికార్ఢి స్థాయి 1.31 శాతానికి పడిపోయినట్లు గణాంకాల్లో తెలింది.
ఆహార పదార్థాలు, చమురు, ఇంధన ధరల్లో వద్ధే.. డబ్ల్యూపీఐ పెరిగేందుకు కారణంగా తెలిపింది వాణిజ్య మంత్రిత్వ శాఖ.
Also read: Stocks today: బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి- ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
ద్రవ్యోల్బణం దేనిపై ఎంత పెరిగింది?
ఇంధనం, విద్యుత్ టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 37.2 శాతానికి పెరిగింది. సెప్టెంబర్‌లో ఇది 25 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతన్నాయి.
తయారీ ఉత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం కూడా గత నెల 12 శాతానికి పెరిగింది.
ముడి చమురు టోకు ద్రవ్యోల్బణం అక్టోబరులో 80.57 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది వాణిజ్య శాఖ. ఇది సెప్టెంబరులో 71.86 శాతంగా ఉందని పేర్కొంది.
ఆహార ఉత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం కూడా అక్టోబర్‌లో 3.06 శాతానికి పెరిగింది. ఇది సెప్టెంబర్‌లో 1.14 శాతం వద్ద ఉండటం గమనార్హం.
Also read: Apple Store Workers: స్టోర్ ఉద్యోగులకు రూ.223 కోట్లు చెల్లించేందుకు యాపిల్ ఓకే!
Also read: SBI Card Alert: ఎస్బీఐ కార్డ్ యూజర్లకు షాక్- ఈఎంఐ లావాదేవీలకు ఛార్జీల బాదుడు!
రిటైల్ ద్రవ్యోల్బణం ఇలా..
అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) కూడా స్వల్పంగా పెరిగింది. గత నెలలో సీపీఐ 4.48 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఇటీవల వెల్లడించింది. సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతంగా నమోదవడం గమనార్హం.
Also read: 10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? పదండి తెలుసుకుందాం
Aslo read: Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఈ-మోటార్ సైకిళ్లు- ఆ తర్వాత విద్యుత్ కార్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి