crypto markets క్రిప్టో కరెన్సీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. తాజాగా టెర్రా బ్లాక్‌చెయిన్‌కు చెందిన లునా క్రిప్టో కరెన్సీకి కూడా కష్టాలు తప్పడం లేదు. లూనా కరెన్సీ విలువ భారీగా పడిపోయింది. ఏడు రోజుల వ్యవధిలో ఏకంగా 100 శాతం క్రాష్ అయింది. దీంతో లూనా కరెన్సీ విలువ ఒక్కసారిగా సున్నాకు పడిపోయింది. కొన్ని వారాల కిందట జోరు మీద ఉన్న లూనా కరెన్సీ ఇప్పుడు దారుణంగా పతనం అవడంతో పెట్టబడిదారులు ఆందోళ చెందుతున్నారు. కొన్నివారాల కిందట బాగా ట్రేడ్ అయిన కరెన్సీ ఒక్కసారిగా పతనం అవడంతో పెట్టుబడి దారులు భారీగా నష్టపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిందటి నెల క్రిప్టో కరెన్సీ విలువ 116 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మే నెలకు వచ్చేసరికి ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఈ లూనా క్రిప్టో కాయిన్ మార్కెట్ విలువ దాదాపు 40 బిలియన్ డాలర్ల నుంచి 6 మిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. లూనా కంటే దాని  సిస్టర్ టోకెన్ యూఎస్‌టీ పైనే ఆధారపడి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టారు. అయితే లూనా కరెన్సీ యూఎస్‌టీ నుంచి బయటకు రావడంతో లూనాపై అపనమ్మకం పెరిగిపోయి మార్కెట్ ఒక్కసారిగా దెబ్బతిన్నది. క్రమక్రమంగా పతనం ప్రారంభమై ఇప్పుడు సున్నాకు పడిపోయింది.


దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన బినాన్స్ లూనాను డీలిస్ట్ చేసింది. గ్లోబల్ ఎక్స్చేంజీల నిర్ణయం తర్వాత  లూనాతో పాటు వజీర్‌ఎక్స్, కాయిన్‌డీసీఎక్స్ కాయిన్‌స్విచ్ కుబేర్ లాంటి క్రిప్టో కరెన్సీలను ఇండిన్ ఎక్సేంజ్‌లు  డీలిస్ట్ చేశాయి. క్రిప్టో కరెన్సీలో ఉన్న సంస్థలు అన్నీ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాయి. బిట్ కాయిన్ రేటు రూ.22.85 లక్షలకు పడిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఇప్పుడు ఏకంగా 35 శాతం కుప్పకూలింది. కిందటి ఏడాది ఆల్ టైం రికార్డు సృష్టించిన 69 వేల డాలర్లు పలికిన బిట్ కాయన్ పతనం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా 19 శాతానికి తగ్గిపోయింది. మరో క్రిప్టో కరెన్సీ అయిన ఇథీరియం రూ.1.66 లక్షల వద్ద పలుకుతోంది. టెథర్ ధర రూ.77 వద్ద ట్రేడ్ అవుతోంది. కార్డానో క్రిప్టో విలువ రూ.44 వద్ద కొనసాగుతోంది.  బినాన్స్ కాయిన్ రేటు రూ.23.974 వద్ద కొనసాగుతోంది. ఎక్స్ఆర్‌పీ రేటు రూ.35 వద్ద పలుకుతోంది. ఇక డోజికాయిన్ ధర రూ.7 వద్ద కొనసాగుతోంది.


also read LIC Share Allotment: ఎల్ఐసీ షేర్ల కేటాయింపు ఏ ప్రాతిపదికన ఎలా జరిగిందో తెలుసా


also read Vivo Y53S Amazon: రూ.23 వేల విలువైన Vivo స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ.3 వేలకే కొనండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.