LIC Share Allotment: ఎల్ఐసీ షేర్ల కేటాయింపు ఏ ప్రాతిపదికన ఎలా జరిగిందో తెలుసా

LIC Share Allotment: దేశంలోని అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఐపీవో షేర్ల కేటాయింపు ముగుస్తోంది. కొంతమందికి షేర్లు కేటాయించగా..మరి కొంతమందికి దక్కలేదు. అయితే షేర్ల కేటాయింపు ఎలా జరిగింది, ఏ ప్రాతిపదికన కేటాయింపులు జరిగాయనేది ఆసక్తిగా మారింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 14, 2022, 05:33 PM IST
  • పూర్తయిన ఎల్ఐసీ ఐపీవో షేర్ల కేటాయింపు, దక్కనివారికి రిఫండ్ చెల్లింపు ప్రారంభం
  • రిటైల్ ఇన్వెస్టర్లతో పోలిస్తే పాలసీదారులకే తక్కువ కేటాయింపు
  • 1 లాట్ కోసం అప్లే చేసుకున్న పాలసీదారులకు కూాడా దక్కని షేర్లు
LIC Share Allotment: ఎల్ఐసీ షేర్ల కేటాయింపు ఏ ప్రాతిపదికన ఎలా జరిగిందో తెలుసా

LIC Share Allotment: దేశంలోని అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఐపీవో షేర్ల కేటాయింపు ముగుస్తోంది. కొంతమందికి షేర్లు కేటాయించగా..మరి కొంతమందికి దక్కలేదు. అయితే షేర్ల కేటాయింపు ఎలా జరిగింది, ఏ ప్రాతిపదికన కేటాయింపులు జరిగాయనేది ఆసక్తిగా మారింది. 

ఎల్ఐసీ 2022లో ఐపీవో ప్రారంభమైంది. మే 4 నుంచి 9వ తేదీ వరకూ ఎల్ఐసీ ఐపీవో షేర్ల కేటాయింపుకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. ఆ తరువాత ఎల్ఐసీ..దరఖాస్తుదారులకు షేర్లను కేటాయించడం ప్రారంభించింది. కొంతమందికి షేర్లు దక్కగా..మరి కొంతమందికి దక్కలేదు. షేర్లు దక్కనివారికి రిఫండ్ చెల్లింపు కూడా నిన్నటి నుంచి అంటే మే 13 నుంచి ప్రారంభమైంది. 

షేర్ల కేటాయింపు పూర్తయినందున..ఎవరికైతే షేర్లు దక్కలేదో వారి సందేహాలు మాత్రం నివృత్తి కాలేదు. షేర్ల కేటాయింపు ఏ ప్రాతిపదికన ఎలా జరిగిందనేది స్పష్టత రాలేదు. షేర్లు దక్కినవారికి కూడా ఏ పద్ధతిలో కేటాయింపు జరిగిందనేది తెలుసుకోవల్సిన అవసరముంది. షేర్ల కేటాయింపు జరిగినవారికి ఎస్ఎంఎస్ లేదా ఈ మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ అందింది. అయితే ఎల్ఐసీ షేర్ల కోసం అప్లై చేసుకున్న వారందరికీ దాదాపుగా షేర్ల కేటాయింపు జరిగిందని అర్ధమైంది. అదే సమయంలో చాలామంది షేర్ హోల్డర్లకు నిర్ధీత 15 షేర్లు కూడా కేటాయించలేదని తెలుస్తోంది. 

షేర్ కేటాయింపు ఎలా జరిగింది

పలువురు షేర్ మార్కెట్ నిపుణులు, ఎల్ఐసీ పాలసీదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు చెప్పినదాని ప్రకారం రిటైల్ కేటగరీలో ఎవరైనా అత్యధికంగా 210 షేర్ల కోసం అప్లై చేసుకుంటే.. 904 రూపాయల చొప్పున 77 షేర్లు కేటాయించారని తెలుస్తోంది. ఎల్ఐసీ పాలసీదారులకైతే అథ్యధికంగా షేర్ లాట్ కోసం అప్లై చేసుకుంటే 48 వరకూ కేటాయించారని తెలుస్తోంది. అంటే రిటైల్ ఇన్వెస్టర్లతో పోలిస్తే పాలసీదారులకు తక్కువ కేటాయింపు జరిగిందని అర్ధమౌతోంది. రిటైల్ కేటగరీలో 1 లాట్ అప్లికేషన్ కోసం 15 షేర్లు దక్కితే..పాలసీదారులకు మాత్రం 1 లాట్ కోసం అప్లై చేసినా దక్కని వైనం.

మే 4 నుంచి మే 9వ తేదీ మధ్యన ఎల్ఐసీ ఐపీవో విడుదలైంది. చివరిరోజున అత్యధికంగా 2.95 రెట్లు ఎక్కువగా స్పందల లభించింది.16 కోట్ల 20 లక్షల 78 వేల 67 షేర్లకు గానూ, 47 లక్షల 83 వేల 67 వేల 10 షేర్లు లభించాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు 45 రూపాయలు డిస్కౌంట్ లభిస్తే..పాలసీదారులకు 60 రూపాయలు డిస్కౌంట్ లభించింది. 

Also read: Vivo Y53S Amazon: రూ.23 వేల విలువైన Vivo స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ.3 వేలకే కొనండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News