National Pension System: ప్రస్తుతం చాలామంది రిటైర్మెంట్ తరువాత జీవితం ఎలా గడపాలని అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం సంపాదిస్తున్న దాంట్లో నెలవారీ ఖర్చులకే ఎక్కువ మొత్తం పోతున్నా.. వృద్ధాప్యంలో సౌకర్యవంతమైన జీవితానికి, మీ ఖాతాలో భారీ మొత్తం, ప్రతి నెలా సాధారణ ఆదాయం చాలా ముఖ్యం. మీరు ఇప్పటి నుంచే పెట్టుబడి పెట్టడం ద్వారా మీ వృద్ధాప్య జీవితాన్ని సాఫీగా గడపడానికి అనేక గొప్ప పథకాలు ఉన్నాయి. అటువంటి పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్). ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ వృద్ధాప్యానికి సంబంధించి భారీ మొత్తాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది పెట్టుబడి పరిమితి లేని అత్యంత ప్రజాదరణ పొందిన పెన్షన్ పథకం. విశేషమేమిటంటే ఈ పథకంలో ఎన్నారైలు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..


ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు..?


- 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
- ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు
- ఈ పథకం కింద టైర్ 1, టైర్ 2 అనే రెండు ఖాతాలు ఉంటాయి.
- టైర్ 1 లేకుండా ఎవరూ టైర్ 2 ఖాతాను తెరవలేరు
- ఇది ప్రభుత్వ మద్దతుతో కూడిన సామాజిక భద్రతా పెట్టుబడి పథకం.
- ఇందులో పెట్టుబడిదారుడు రుణం, ఈక్విటీ ఎక్స్‌పోజర్ రెండింటినీ పొందుతాడు.


ఎన్‌పీఎస్ నుంచి కోట్లు ఎలా వస్తాయి..?


ఒక పెట్టుబడిదారుడు 28 సంవత్సరాల వయస్సులో ప్రతి నెలా 10 వేల రూపాయలు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టి 60 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగిస్తే.. అతనికి 1.5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ డబ్బు‌తో పాటు నెలకు 75 వేల రూపాయల పెన్షన్ కూడా లభిస్తుంది. 


లెక్కలు ఇలా..


28 సంవత్సరాల వయస్సు నుంచి 60 ఏళ్ల వరకు మనం ప్రతి నెలా 10 వేల రూపాయలు పెట్టుబడి పెడితే.. 
మొత్తం = 38 లక్షల 40 వేల రూపాయలు
ఇప్పుడు అంచనా వేసిన 10 శాతం రాబడి ప్రకారం..
మొత్తం కార్పస్ = 2.80 కోటి రూపాయలు 
ఇప్పుడు మొత్తం = 1.6 కోట్ల రూపాయలు
ఇప్పుడు మనం సంవత్సరానికి 8% యాన్యుటీ రేటును అంచనా వేస్తే 60 సంవత్సరాల తర్వాత
మొత్తం (పెన్షన్) = నెలకు 75 వేల రూపాయలు వస్తుంది.


Also Read: Chalapathi Rao Death: టాలీవుడ్లో మరో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు చలపతి రావు మృతి!


Also Read: Year Ender 2022: ఈ ఏడాది సెంచరీ కరువు తీర్చుకున్న ఆటగాళ్లు వీళ్లే..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.