Year Ender 2022: ఈ ఏడాది సెంచరీ కరువు తీర్చుకున్న ఆటగాళ్లు వీళ్లే..

Cricket Records in 2022: క్రికెట్‌లో ఈ ఏడాది ఎన్నో అద్భుత ఘటనలు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఆటగాళ్ల సెంచరీ నిరీక్షణ ఈ ఏడాది తెరపడిపోయింది. ఈ ఏడాది సెంచరీల కరువును ఏ బ్యాట్స్‌మెన్‌లు తీర్చుకున్నారో తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 06:48 AM IST
Year Ender 2022: ఈ ఏడాది సెంచరీ కరువు తీర్చుకున్న ఆటగాళ్లు వీళ్లే..

Cricket Records in 2022: ఈ ఏడాదికి గుడ్‌ బై చెప్పి.. 2023 న్యూ ఇయర్‌కు స్వాగతం పలికేందుకు అంతా రెడీ అవుతున్నారు. మరో ఆరు రోజుల్లో 2022 ముగియబోతుంది. ఈ సంవత్సరం క్రికెట్‌లో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత కాలంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ విరాట్ కోహ్లి నుంచి స్టీవ్ స్మిత్ వరకు ఈ సంవత్సరం సుదీర్ఘ సెంచరీల కరువుకు తెరపడింది. ఈ స్టార్ ఆటగాళ్లు నిరంతరం పరుగులు చేస్తున్నా.. కానీ సెంచరీ చేయలేకపోయారు. ఈ ఏడాది సెంచరీల కరువును ఏ బ్యాట్స్‌మెన్‌లు తీర్చుకున్నారో తెలుసుకుందాం.

విరాట్ కోహ్లీ

టీమిండియా రన్‌ మెషీన్ సెంచరీ కోసం కోట్లాది మంది అభిమానులు ప్రార్థించారు. అతితక్కువ కాలంలోనే 70 అంతర్జాతీయ సెంచరీలు బాదిన కోహ్లీకి.. 71వ సెంచరీ కోసం చాలా రోజులే నిరీక్షించాల్సి వచ్చింది. నవంబర్ 22, 2019న విరాట్ తన 70వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. ఆ తర్వాత కరోనా బ్రేక్ కారణంగా క్రికెట్‌లో విరామం ఏర్పడింది. మైదానంలోకి తిరిగి వచ్చిన తర్వాత.. కోహ్లీ 2020లో 22 మ్యాచ్‌ల్లో 842 పరుగులు చేశాడు. కానీ సెంచరీ చేయలేకపోయాడు. 2021లో అతను 24 మ్యాచ్‌లలో 964 పరుగులు చేశాడు. కానీ ఈ ఏడాది కూడా కోహ్లీ బ్యాట్‌ నుంచి సెంచరీ రాలేదు. 2022 అర్ధ సంవత్సరం కూడా గడిచిపోయింది. అయినా కింగ్ కోహ్లీ శతకం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఆసియా కప్ 2022లో అప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 122 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ను ఆడి.. టీ20 ఇంటర్నేషనల్‌లో తన మొదటి సెంచరీని కూడా సాధించడంతో పాటు సుదీర్ఘ కరువుకు చెక్ పెట్టాడు. నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై 113 పరుగులు చేసి వన్డేల్లో 44వ సెంచరీని నమోదు చేశాడు.

స్టీవ్ స్మిత్

ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కూడా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. జనవరి 2021లో భారత్‌పై 131 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన తర్వాత.. స్టీవ్ స్మిత్ ఫామ్‌ కోల్పోయాడు. జూలై 2022లో స్మిత్ శతక నిరీక్షణకు తెరపడింది. శ్రీలంకపై క్లిష్ట పరిస్థితుల్లో స్మిత్ సెంచరీ సాధించాడు. దీని తర్వాత అతను డబుల్ సెంచరీతో సహా మరో రెండు సెంచరీలు చేశాడు.

డేవిడ్ వార్నర్

జనవరి 14, 2020న భారత్‌పై డేవిడ్ వార్నర్ తన 43వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. ఆ తరువాత మరో శతకం కోసం 67 ఇన్నింగ్స్‌లు ఎదురు చూడాల్సి వచ్చింది. నవంబర్ 22, 2022న ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 106 పరుగులు చేసి సెంచరీ కరువును తీర్చుకున్నాడు.

ఛెతేశ్వర్ పుజారా

టీమిండియా నయా వాల్‌గా పేరు తెచ్చుకున్న ఛెతేశ్వర్ పుజారాకి సెంచరీ కోసం చాలా గ్యాప్ వచ్చింది. జనవరి 03, 2019న ఆస్ట్రేలియాపై పుజారా 193 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తరువాత పుజారా 2020, 2021లో కష్టపడి 18 టెస్టుల్లో 865 పరుగులు చేయగలిగాడు. కానీ సెంచరీ మాత్రం సాధించలేకపోయాడు. డిసెంబర్ 14, 2022న బంగ్లాదేశ్‌పై పుజారా అజేయంగా 102 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Also Read: చెన్నై జట్టులోకి బెన్ స్టోక్స్‌.. ఇక ఎంఎస్ ధోనీ ఉంటాడా! సీఎస్‌కే సీఈఓ ఏమన్నాడంటే

Also Read: Agriculture Loan: రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్క మిస్ట్ కాల్‌తో లోన్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News