Engineering Students Dead In Road Accident: స్నేహితుల దినోత్సవం రోజు ఘోర విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏలూరు దగ్గరలోని రామచంద్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న 10 మంది విద్యార్థులు శనివారం విహారయాత్రకు వెళ్లారు. ఓ డ్రైవర్‌తో కలిసి రెండు కార్లలో అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి సమీపంలో ఉన్న గుడిసె పర్యాటక ప్రాంతంలో పర్యటించారు. అక్కడి ప్రకృతి అందాలను వీక్షించి.. శనివారం రాత్రి తిరుగుపయనయ్యారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తరువాత బూరుగుపూడి సమీపంలో ఉన్న కొత్త, పాత బ్రిడ్జిల మధ్య ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు ఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతులను ఉదయ్‌కిరణ్‌, హర్షవర్ధన్‌, హేమంత్‌గా గుర్తించారు. గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 


అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో శనివారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తాడిపత్రి హైవే పై ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో తాడిపత్రికి చెందిన ముగ్గురు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కొత్త కారు కొన్న సందర్భంగా పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా.. రావి వెంకటాంపల్లి గ్రామంలో ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు కారు ఢీకొంది. మద్యం మత్తులో కారు అతివేగంగా నడపడం వల్ల ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. 


Also Read: Hidimba OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘'హిడింబ'’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?


Also Read: Ileana Dcruz baby: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి