Hidimba OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘'హిడింబ'’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

Hidimba Movie: టాలెంటెడ్ యాక్టర్ అశ్విన్ బాబు, నందిత శ్వేత లీడ్ రోల్స్ లో చేసిన చిత్రం 'హిడింబ'. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 6, 2023, 08:53 AM IST
Hidimba OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘'హిడింబ'’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

Hidimba in OTT: టాలీవుడ్ యంగ్‌ హీరో అశ్విన్ బాబు, నందిత శ్వేత జంటగా నటించిన చిత్రం 'హిడింబ'(Hidimba Movie). అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. మే 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌కు కాస్త పీరియాడికల్‌ టచ్ ఇచ్చి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో అశ్విన్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. థియేటర్లలో ఓ యావరేజ్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అయిన ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసింది. 

తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది ఆహా. ఈ సినిమాను ఆగస్టు 10, సాయంత్రం 07 గంటల నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, రఘు కుంచె, శ్రీనివాసరెడ్డి, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల, షిజ్జు, రాజీవ్ పిళ్ళై, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి వికాస్ బాడిస సంగీతం అందించారు. హైదరాబాద్ లో కిడ్నాప్ కు గురైన మహిళల మిస్టరీని ఛేదించే పోలీసు ఆఫీసర్లుగా నందితా శ్వేత, అశ్విన్ బాబు కనిపిస్తారు. ఇన్వెస్టిగేషన్‌లో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ కిడ్నాప్ మిస్టరీని వారు ఛేదించారా లేదా అనేది తెలుసుకోవాలంటే హిడింబ సినిమాను చూడాల్సిందే. థియేటర్లలో మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News