Punjab Road Accident:  పంజాబ్‌లో ఘోర దుర్ఘటన సంభవించింది. హోషియార్​పుర్​ జిల్లా గర్‌శంకర్‌ ప్రాంతంలో కాలినడకన వెళ్తున్న యాత్రికులను ఓ గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా..  పలువురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగిందంటే..
బుధవారం బైశాఖీ పర్వదిన వేడుకల్లో పాల్గొనేందుకు సుమారు 50 మంది భక్తులు చరణ్ చో గంగావైపు నడిచారు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. వీరంతా యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందినవారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 


Also Read: Hyderabad: విషాదం.. కరెంట్‌ షాక్‌తో ఇద్దరు అన్నదమ్ములు, వారి స్నేహితుడు మృతి..


ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి
నిన్న అదే బుధవారం నాడు పంజాబ్‌లోని గర్‌శంకర్‌ ప్రాంతంలోని గర్హి మనోస్వాల్ సమీపంలో ట్రాక్టర బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో 10 మంది గాయపడ్డారు.  బైసాఖీ సందర్భంగా లంగర్‌ ఏర్పాటు చేసేందుకు గార్‌శంకర్‌ సబ్‌ డివిజన్‌లోని శ్రీ ఖురల్‌గర్‌ సాహిబ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గర్‌శంకర్‌ ప్రాంతంలో రోడ్లు పరిస్థితి అద్వానంగా ఉండటం వల్లే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 


Also Read: Khammam Fire Accident: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం.. భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి