Powdered Human Bones: పిల్లలు పుట్టడం లేదని మనిషి ఎముకల పౌడర్ కలిపిన నీళ్లు తాగించారు
Woman Forced To Drink Powdered Human Bones Water: ఇటీవల అమావాస్య నాడు క్షుద్ర పూజల కోసం ఒక మహిళా తాంత్రికురాలిని పిలిపించారు. అత్తింటి వారు అంతా కలిసి బాధితురాలి చేత పలు క్షుద్రపూజలు చేయించారు. అంతటితో ఆగకుండా.. ఆ క్షుద్రపూజల్లోనే భాగంగానే మనిషి ఎముకల పొడిని నీళ్లలో కలిపి ఆమె చేత బలవంతంగా తాగించారు.
Woman Forced To Drink Powdered Human Bones Water: పిల్లలు పుట్టడం లేదనే కారణంతో ఓ మహిళకు ఆమె భర్త, అతడి సోదరుడు, అత్తమామలు, ఇతర కుటుంబసభ్యులు కలిసి బలవంతంగా మనిషి ఎముకల పౌడర్ కలిపిన నీళ్లు తాగించిన ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది. క్షుద్రపూజలతో సంతానం కలుగుతుందనే గుడ్డినమ్మకానికి ఇది పరాకాష్ట. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. 2019 లో ఆ మహిళకు పెళ్లయింది. అయితే పెళ్లయి మూడేళ్లవుతున్నా సంతానం కలగడం లేదంటూ భర్తతో పాటు అత్తామామల వేధింపులు ఎక్కువయ్యాయి. ఓ వైపు పుట్టింటి నుంచి అధిక కట్నం తీసుకురావాలని వేధిస్తూనే మరోవైపు పిల్లలు పుట్టడం లేదనే వేధింపులు కూడా ఎక్కువయ్యాయి.
ఈ క్రమంలోనే ఇటీవల అమావాస్య నాడు క్షుద్ర పూజల కోసం ఒక మహిళా తాంత్రికురాలిని పిలిపించారు. అత్తింటి వారు అంతా కలిసి బాధితురాలి చేత పలు క్షుద్రపూజలు చేయించారు. అంతటితో ఆగకుండా.. ఆ క్షుద్రపూజల్లోనే భాగంగానే మనిషి ఎముకల పొడిని నీళ్లలో కలిపి ఆమె చేత బలవంతంగా తాగించారు. ఆమె వద్దని చెప్పి బతిమాలినా అత్తింటి వారు ఆమె మాట వినిపించుకోలేదు. అంతేకాదు.. క్షుద్రపూజల్లో భాగంగా ప్రత్యేకించి ఒక జలపాతం కింద స్నానం చేయించారు.
అత్తింటి వారి అరాచకాలు శృతి మించుతుండటంతో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సింఘాడ్ రోడ్ పోలీసులు.. ఆమె భర్త, అతడి సోదరుడు, అత్తామామలు, ఇతర కుటుంబసభ్యులు అందరూ కలిపి మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ జయంత్ రాజుర్కర్ మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర క్షుద్రపూజలు, నరబలి, అమానవీయ, అఘోరి నివారణ చట్టం 2013 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అలాగే అధిక కట్నం కోసం వేధిస్తున్న నేరం కింద ఐపిసి సెక్షన్ 498A కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి : Man Dragged on Car Bonnet: కారు బ్యానెట్‌పై యువకుడిని కిలో మీటర్ ఈడ్చుకెళ్లిన యువతి
ఇది కూడా చదవండి : Cell Phone Tower Theft: సినీ ఫక్కీలో ఇంటి మీదున్న సెల్ ఫోన్ టవర్ చోరీ
ఇది కూడా చదవండి : Allu Arjun At Vizag Airport: వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో అల్లు అర్జున్‌కి గ్రాండ్ వెల్‌కమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook