Chhattisgarh BJP MLA's Son in Rape Case: రాయ్‌పూర్: పెళ్లి చేసుకుంటానని చెప్పి గత కొన్నాళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కుమారుడిపై ఫిర్యాదు చేసిన ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో కలకలం సృష్టించింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, జంజ్‌గిర్‌ చంపా ఎమ్మెల్యే నారాయణ్‌ చందేల్‌ కుమారుడు పలాస్‌ చందేల్‌పై చత్తీస్‌ఘడ్ పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. "మహిళా పోలీసు స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని.. కేసు దర్యాప్తు కోసం ఆ కేసును జాంజ్‌గిర్ చంపా పోలీసులకు బదిలీ చేయడం జరిగింది" అని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ కవితా ధుర్వే మీడియాకు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

" తనని పెళ్లి చేసుకుంటాననే సాకుతో గత కొన్నేళ్లుగా జాంజ్‌గిర్-చంపాలో పలాస్ చందేల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అతని కారణంగా గర్భం దాల్చిన తనకు అబార్షన్ కూడా చేయించాడని బాధితురాలు ఆరోపించింది" అని కవితా ధుర్వే చెప్పారు. ఒకే మహిళపై పదే పదే అత్యాచారం చేసిన నేరం కింద అతనిపై ఐపిసి సెక్షన్ 367(2)(n), అలాగే ఒక మహిళ అనుమతి లేకుండానే ఆమెకు అబార్షన్ చేయించిన నేరం కింద ఐపిసి 313 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు కవితా దుర్వే స్పష్టంచేశారు.


నారాయణ్ చందేల్ కుమారుడిపై అత్యాచారం కేసు నమోదైన నేపథ్యంలో చందేల్‌ను బీజేపీ ఆ పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి ధనుంజయ్ సింగ్ ఠాకూర్ బీజేపి అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే, ఈ కేసుపై నారాయణ్ చందేల్ వివరణ కోసం ప్రయత్నించగా.. ఆయన ఫోన్ కాల్‌కి స్పందించలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పలాస్ చందేల్ తండ్రి ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత కూడా కావడంతో ఈ కేసు తీవ్రత మరింత పెరిగింది. అధికార పార్టీ నేతలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు.


ఇది కూడా చదవండి : Vastu Tips : లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఇలా పెడితే వద్దన్నా ధనం వచ్చిపడుతుందట


ఇది కూడా చదవండి : How to Get Good Luck: ఇలాంటి పనులు చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వెంట పడుతుందట


ఇది కూడా చదవండి : Tata Punch, Baleno: మార్కెట్లోకి కొత్త కారు ఎంట్రీ.. ఇప్పుడు టాటా పంచ్, బలెనో పరిస్థితి ఏంటి ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook