Nagloi Metro Station: మెట్రో రైలు స్టేషన్‌లో భారీ శబ్ధంతో తుపాకీ కాల్పులు జరిగాయి. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు భయాందోళన చెందగా.. రక్తపుమడుగులో ఓ వ్యక్తి కనిపించాడు. ఈ ఘటనతో బెంబేలెత్తిన ప్రయాణికులు వెంటనే స్టేషన్‌ బయటకు వెళ్లారు. ఈ సంఘటన ఢిల్లీ మెట్రో రైలులో జరిగింది. మృతుడు ఓ కానిస్టేబుల్‌ అని తెలిసింది. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: April Fool Prank Tragedy: ఫ్రెండ్‌ను 'ఏప్రిల్‌ ఫూల్‌' చేయబోయి ప్రాణం పోగొట్టుకున్న విద్యార్థి.. వీడియో కాల్‌లో


 


సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్‌గా ష్రేర్‌ కిశోర్‌ పని చేస్తుండేవాడు. 2014 బ్యాచ్‌కు చెందిన కిశోర్‌ ఢిల్లీలోని నాగ్‌లోయ్‌ మెట్రో స్టేషన్‌కు గురువారం ఉదయం 7.03 గంటల సమయంలో చేరుకున్నాడు. లగేజీ తనిఖీ కేంద్రం వద్దకు చేరుకోగానే తన బ్యాగ్‌లో నుంచి తుపాకీని తీసి తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన మెట్రో సిబ్బంది వెంటనే అతడిని గమనించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు స్టేషన్‌కు వచ్చి మృతదేహం పరిశీలించారు. అతడి మృతదేహం పరిశీలించగా.. ఆచూకీ లభించింది. 2022 జనవరి నుంచి ఢిల్లీలో కిశోర్‌ విధులు నిర్వహిస్తున్నాడని తేలింది. అయితే ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: Nightclub Fire: నైట్‌క్లబ్‌లో ఘోర విషాదం.. అగ్నికీలలు చెలరేగి 29 మంది దుర్మరణం


 


నరేలా ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివసిస్తున్న కుటుంబసభ్యులు సమాచారం అందుకుని ఆస్పత్రికి చేరుకున్నారు. వారి నుంచి వివరాలు సేకరించి కారణాలు తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. మెట్రో స్టేషన్‌లో తుపాకీ కాల్పులు జరగడం కలకలం రేపింది. ఉద్యోగ వేధింపులా లేదా కుటుంబ కలహాల కారణంగా కిశోర్‌ ఆత్మహత్యకు పాల్పడడ్డా అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook