Daughter Kidnap: తల్లిదండ్రులు చెప్పిన దాని కోసం తన కలను పక్కన పెట్టేసింది. వేరే ఊరికి పంపించడంతో తల్లిదండ్రులకు చెప్పాపెట్టకుండా స్వగ్రామానికి చేరుకుని ఇతరులతో కలిసి ఉంటోంది. ఈ సమయంలో తన కల తీర్చుకోవడానికి ఓ పన్నాగం పన్నింది. దుర్బుద్ధితో సొంత తండ్రిని మోసం చేయాలని సూచించింది. దీనికి కిడ్నాప్‌ డ్రామా చేయాలని ప్రణాళిక రచించింది. పక్కాగా కిడ్నాప్‌కు గురయ్యినట్లు నాటకం ఆడింది. అయితే పోలీసుల ముందు ఎవరి డ్రామాలు నడవవనే వాస్తవం అందరికీ తెలిసిందే. పోలీసులు విచారణ చేపట్టగా ఆ యువతి ఆడిన డ్రామా బయటపడింది. తన కుమార్తె ఇలాంటి పని చేసిందని తెలిసి తల్లిదండ్రులు నివ్వెరపోయారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Boy Hospitalised: పాడు సమాజం.. ఏపీలో అబ్బాయిపై సామూహిక అత్యాచారం


 


మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన కావ్య ధఖడ్‌ (21) పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా కావ్యను కుటుంబసభ్యులు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇప్పించేందుకు కోటా పట్టణంలో కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించారు. అయితే తనకు శిక్షణ పొందడం ఇష్టం లేదు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉండడంతో తల్లిదండ్రులకు తెలియకుండా ఓ పని చేసింది. కోచింగ్‌ సెంటర్‌లో చేరినట్టు నటించి తల్లితోపాటు మూడు రోజులు హాస్టల్‌లో ఉంది. తల్లి అలా ఊరికి వెళ్లిపోగానే కావ్య ఇండోర్‌ నగరానికి చేరుకుంది. అక్కడ తన స్నేహితులైన ఇద్దరు అబ్బాయిలతో కలిసి ఓ గదిలో ఉంటోంది. తల్లిదండ్రులు ఫోన్‌ చేస్తే కోచింగ్‌ సెంటర్‌లో ఉన్నట్లు, పరీక్షలు రాస్తున్నట్లు నమ్మించింది. నమ్మించేందుకు మార్కులు కూడా వచ్చాయని చెబుతూ కొన్ని పత్రాలు చూపిస్తోంది.

Also Read: Girl Pregnancy: పరీక్ష హాల్‌లో అడ్డం పడిన బాలిక.. ఆస్పత్రికి వెళ్తే గర్భవతి రూ.2 లక్షలకు ఖరీదు


 


విదేశాలకు వెళ్లి చదివేందుకు డబ్బు కావాల్సి ఉండడంతో తండ్రిని మోసం చేయాలని చూసింది. తాను కిడ్నాప్‌ అయినట్లు నమ్మించేందుకు ప్రయత్నం చేసింది. మార్చి 18వ తేదీన కావ్య తన తండ్రికి ఫోన్‌కు కొన్ని ఫొటోలు పంపించింది.  తాళ్లతో బంధించి కిడ్నాప్‌ అయినట్లు కిడ్నాపర్ల పేరుతో సందేశం పంపింది. రూ.30 లక్షలు ఇస్తేనే అమ్మాయిని విడిపిస్తామని అందులో ఉంది. భయాందోళన చెందిన తండ్రి వెంటనే కోటాలోని కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లాడు. అనంతరం అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కావ్య కోచింగ్‌ తీసుకోవడం లేదని నివ్వెరపోయాడు. ఇండోర్‌ వెళ్లినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.


అనంతరం ఇండోర్‌లో విచారణ చేయగా కావ్య చేసిన డ్రామా బయటపడింది. అక్కడ ఇద్దరు అబ్బాయిలతో కావ్య తిరుగుతున్న దృశ్యాలు లభించాయి. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలుసుకున్న కావ్య, ఇద్దరు అబ్బాయిలు పరారయ్యారు. ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు కుమార్తె ఈ పని చేసిందని తెలిసి తండ్రి నివ్వెరపోయారు. ఇంట్లోనే ఫొటోలు తీయించుకుని కిడ్నాప్‌ అయినట్లు నమ్మించిందని పోలీసులు తెలిపారు. అయితే ముగ్గురి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కావ్యను త్వరలోనే పట్టుకుని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter