Attack On Minor Girl: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కామం మైకంలో పసి పిల్లలను కూడా చూడడం లేదు. తాజాగా మరో బాలికపై దారుణాతి దారుణంగా అత్యాచారం జరిగింది. గంజాయి మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తుమ్మచెట్ల చాటున నిర్మానుష్య ప్రాంతంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో కలకలం.. మహిళా డాక్టర్‌ చేయి పట్టుకు లాగిన రోగి


మచిలీపట్నం గోపాల్ నగర్‌కు చెందిన పోలిశెట్టి పవన్ కుమార్ ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతూ గంజాయికి బానిస అయ్యాడు. నిత్యం గంజాయి మత్తులో తూగుతూ.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతోంది. ఇదే క్రమంలో గుమస్తాల కాలనీకి చెందిన ఓ బాలిక రుస్తుంబాద పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తండ్రి మరణించగా దివ్యాంగురాలైన (అంధురాలు) తల్లి పింఛన్‌తో బతుకు ఈడుస్తున్న కుటుంబం.

Also Read: Insta Reels: ఇన్‌స్టా రీల్స్‌ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబం


కుటుంబ పరిస్థితుల కారణంగా బాలిక పని చేసుకుంటూ చదువు కొనసాగిస్తోంది. జులాయిగా తిరిగే పవన్‌ కుమార్‌ కన్ను బాలికపై పడింది. అదును కోసం ఎదురుచూస్తున్న పవన్ శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి మైనర్ బాలిక ఒంటరిగా వస్తున్న విషయాన్ని గుర్తించాడు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న పవన్‌ తన ద్విచక్ర వాహనంపై బాలికను ఎత్తుకెళ్లాడు. హౌసింగ్ బోర్డ్ పొలిమేరలో తుమ్మ చెట్ల చాటున పాశవికంగా బాలికపై అత్యాచారం చేశాడు.


దారుణానికి పాల్పడిన అనంతరం బాలికను వదిలేసి పారిపోయాడు. అయితే తీవ్రమైన నొప్పితో ఇబ్బందులు ఎదుర్కొంటూ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చింది. కుటుంబసభ్యులకు జరిగిన విషయం వివరించింది. వెంటనే కుటుంబసభ్యులు చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై సుబ్రమణ్యం బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.