)
Woman Doctor Attacked By Patient: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయిన గాంధీ ఆస్పత్రిలో ఓ రోగి వైద్యురాలిపై దాడికి పాల్పడ్డాడు. చికిత్స అందిస్తున్న జూనియర్ వైద్యురాలిపై దారుణంగా వ్యవహరించాడు. ఆమె చేయి పట్టుకుని దాడికి పాల్పడడంతో కలకలం రేపింది. దేశవ్యాప్తంగా వైద్యులపై దాడులు జరుగుతున్న విషయం మరువకముందే తెలంగాణలో మహిళ డాక్టర్‌పై దాడి జరగడంతో వైద్యులకు రక్షణ కరువైందనే చర్చ మొదలైంది. కాగా ఈ దాడిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు.
హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని అత్యవసర విభాగంలో ఓ మహిళ జూనియర్ డాక్టర్‌పై పేషంట్ సహాయకుడు (60) దాడికి పాల్పడ్డాడు. మహిళా వైద్యురాలిపై చేయి పట్టుకొని దాడి చేశాడు. వెంటనే తేరుకున్న తోటి వైద్యులు వెంటనే వారించారు. మిగతా వారు అతడిపై పిడిగుద్దులతో దాడి చేశారు. వైద్యురాలిని అతడి దాడి నుంచి కాపాడారు. అనంతరం అతడిని పరిశీలించగా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. తాగిన మైకంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వైద్యురాలిపై దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది.
కాగా దాడి అనంతరం వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని చిలకల గూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తరచూ రోగులు, వారి సహాయకుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుండడంతో జూనియర్ వైద్యులు ఆందోళన చెందుతున్నారు. తమకు రక్షణ కావాలని కోరుతున్నారు. కాగా గురువారం నుంచి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది.
దాడి విషయమై జూనియర్ వైద్యులు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారిని కలిశారు. జరిగిన విషయాన్ని ఆమెకు తెలిపారు. వెంటనే అతడిపై కేసు నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూడాల ఫిర్యాదుపై స్పందించిన సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. వైద్యులకు బందోబస్తును కూడా పెంచుతామని హామీ ఇచ్చారు.
#AartiRavi#attackon_GANDHI_doctor
Attacks on lady doctors still continued
Lady doctor attacked by patient publicly in casualty in Gandhi hospital Hyderabad.Hatsoff to patient attendent and patient care worker immediately responded
Kolkata episode everyone know how a lady… pic.twitter.com/9sXS8pDhG7
— Dr vasanth kumar gourani (@vasant5577) September 11, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe