Ghaziabad Gangrape Case Updates: ఈ ఘటనలోంచి బయటపడిన యువతి.. ఐదుగురు పురుషులు తనను గ్యాంగ్ రేప్ చేసి ప్రత్యక్ష నరకం చూపించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్యాంగ్ రేప్ చేయడంతో పాటు జననాంగంలోకి ఐరన్ రాడ్డును చొప్పించి టార్చర్ చేశారని ఆ యువతి తన ఫిర్యాదులో వాపోయింది. తన సోదరుడి బర్త్ డే కి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొందామె.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముందుగా సామూహిక అత్యాచార బాధితురాలిగా భావిస్తున్న యువతిని యధావిధిగా వైద్య పరీక్షల కోసం పంపించగా.. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆమె నిరాకరించారు. బాధితురాలికి నచ్చచెప్పి మరొక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె సహకరించలేదు. చివరకు బాధితురాలు చెప్పిన చోటే వైద్య పరీక్షలు చేయించగా.. ఆమెపై లైంగిక దాడి జరిగినట్టుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని తేలింది. 


గ్యాంగ్ రేప్ కేసు బాధితురాలిగా భావిస్తున్న యువతి మెడికల్ రిపోర్ట్స్ చూసి ఖంగుతిన్న పోలీసులు.. అసలేం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకున్నారు. యువతిపై అనుమానంతో మరొక యాంగిల్లో కేసును నరుక్కొచ్చే పనిలో పడిన పోలీసులకు నిర్ఘాంతపోయే విషయాలు వెలుగుచూశాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాకింగ్ చేసిన పోలీసులకు ఒక్క చోట అనుమానం తలెత్తింది. అదే యాంగిల్లో ఆరా తీయగా తీగ లాగితే డొంక బయటపడినట్టు యువతి డైరెక్షన్‌లో తెరకెక్కిన మొత్తం సినిమా రీల్ బయటపడింది. 


ఆస్తి తగాదాలో కొంతమందిని తన ప్రత్యర్థులుగా భావించిన యువతి.. వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఆజాద్ అనే మరో మిత్రుడితో కలిసి పక్కా స్కెచ్ వేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. యువతి ఒక పథకం ప్రకారం వేసుకున్న స్కెచ్‌ని మరో నలుగురు స్నేహితులతో కలిసి ఇంప్లిమెంట్ చేసిందని పోలీసులు తెలిపారు. తానే కిడ్నాప్ చేయించుకుని అపహరణకు గురైనట్టు పోలీసులను నమ్మించింది. గ్యాంగ్ రేప్ డ్రామాను రక్తి కట్టించడానికి గోనె సంచిలో కాళ్లు, చేతులు కట్టేసి పడేసినట్టు ప్లాన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆమెకు సహకరించిన ఆజాద్ అనే మిత్రుడి సెల్ ఫోన్ ఆమె కిడ్నాప్ అయినప్పటి నుంచే స్విచ్ఛాఫ్ అవడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టడం వల్లే ఈ కేసులో కొత్త ట్విస్టులు బయటికొచ్చాయని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరాలు వెల్లడించారు. 



ఈ కేసులో ఇప్పటికే సదరు యువతికి సహకరించిన నలుగురు యువకులను అరెస్ట్ చేసి ఓ వాహనాన్ని సీజ్ చేశామని ఘాజియాబాద్ పోలీసులు తెలిపారు. ఫేక్ కేసుతో మరొకరిపై నేరం మోపడంతో పాటు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన నేరం కింద యువతిపై సైతం చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఘాజియాబాద్‌లో అక్టోబర్ 18న జరిగిన ఈ ఘటనలో ఇంకెన్ని ట్విస్టులు వెలుగు చూడనున్నాయో వేచిచూడాల్సిందే.


Also Read : Woman Gangrape: మహిళపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు కలిసి రెండు రోజుల పాటు నరకం.. అక్కడ రాడ్ దూర్చి మరీ!


Also Read : USA New Act: అమెరికాలో ఇప్పుడు పట్టపగలే లూటీలు, దొంగతనాలు చేసుకోవచ్చు


Also Read : Patamata Girl Molestation Case : తాతయ్య ఇంట్లో ఒంటరిగా.. గర్భం దాల్చిన బాలిక.. ఫ్రెండ్స్‌తో కలిసి ఆకతాయి ఘోరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి