Gang Rape at Ghaziabad News in Telugu: మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకు వస్తున్నా వారి మీద అఘాయిత్యాలు ఆగడం లేదు సరికదా ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ చెబుతున్న వివరాల ప్రకారం.. ఓ మహిళపై అత్యాచారం చేసిన తర్వాత జననాంగాల్లో రాడ్‌ని అమర్చిన షాకింగ్ వార్త తెర మీదకు వచ్చింది. గతంలో ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయను కూడా ఇదే రీతిలో జననాంగాల్లో రాడ్ అమర్చి చిత్రవధలకు గురి చేశారు.
ఇప్పుడు కూడా ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో ఇలాంటి ఒక ఘటన తెర మీదకు వచ్చింది. ఇక ఈ అంశం దేశవ్యాప్తంగా షాక్ కలిగిస్తోందని చెప్పాలి. ఢిల్లీకి చెందిన ఒక మహిళ రాత్రి ఘజియాబాద్ నుండి తిరిగి వస్తుండగా ఆమెను కొందరు దుండగులు బలవంతంగా కారులో ఎక్కించుకున్నారని, సుమారు ఐదుగురు వ్యక్తులు 2 రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేసి, ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో రాడ్‌ని కూడా అమర్చారని తెలుస్తోంది. ఘజియాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 18, తెల్లవారుజామున 3:30 గంటలకు, ఆశ్రమ రోడ్డులో ఒక మహిళ అచేతనంగా పడి ఉన్నట్లు పోలీసు స్టేషన్ నంద్‌గ్రామ్‌కు యూపీ-112 ద్వారా సమాచారం అందింది.
వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను ఆసుపత్రికి తరలించగా అనంతరం విచారణలో తాను ఢిల్లీ నంద్ నగరి నివాసి అని తేలింది. ఆమె తన సోదరుడి పుట్టినరోజు నేపథ్యంలో ఘజియాబాద్‌కు వచ్చిందని, ఆ సమయంలో ఆమెకు తెలిసిన కొంతమంది ఆమెను అక్కడి నుండి కారులో తీసుకెళ్లారని అంటున్నారు. మొదట ఇద్దరే కారులో ఎక్కించుకున్నా తరువాత 5 మంది తనపై అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు వెల్లడించింది.
మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులలో ఒకరితో మహిళకు బాధిత మహిళకు ఆస్తి తగాదా ఉందని, ఇరువర్గాలకు సంబంధించి కేసు కోర్టులో నడుస్తోందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఘజియాబాద్ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధిత మహిళ అత్తమామలు దుర్గాపురి షహదారాలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అక్కడ ఒక ఆస్తి ఉంది, దాని గురించి ఏర్పడిన వివాదం వలనే ఆమెను అపహరించి రేప్ చేశారని అంటున్నారు.
ఇక ఈ వ్యవహారంలో స్వాతి మలివాల్ ఘజియాబాద్ పోలీసులకు నోటీసులు పంపారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేస్తూ, 'ఢిల్లీ అమ్మాయి ఘజియాబాద్ నుండి రాత్రి తిరిగి వస్తుండగా, ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని, మహిళపై ఐదుగురు వ్యక్తులు 2 రోజుల పాటు అత్యాచారం చేసి, ఆమె జననాంగాలలో రాడ్‌తో దాడి చేశారు. రోడ్డు పక్కన ఒక గోనె సంచిలో, అప్పుడు కూడా రాడ్ దాని లోపల ఉంది’’ అని పేర్కొన్నారు. అయితే స్వాతి మలివాల్ ఆరోపణలపై ఘజియాబాద్ పోలీసులు స్పందించారు. మహిళ ప్రైవేట్ పార్ట్ రాడ్‌లోకి చొప్పించి గోనె సంచిలో బంధించి ఉంచారనే ఆరోపణలను పోలీసులు ఖండించారు.
Also Read: 7th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి గిఫ్ట్ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook