USA New Act: అమెరికాలో ఇప్పుడు పట్టపగలే లూటీలు, దొంగతనాలు చేసుకోవచ్చు

USA New Act: ప్రపంచంలో అగ్రరాజ్యంగా భావించే అమెరికాలో ఇప్పుుడు యధేఛ్చగా పట్టపగలే లూటీలు చేసుకోవచ్చు లేదా దొంగతనాలకు పాల్పడవచ్చు. పోలీసులు ఏం చేయరు. చోద్యం చూస్తుంటారు. ఇది నేరం కూడా కాదిప్పుడు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 17, 2022, 10:48 PM IST
USA New Act: అమెరికాలో ఇప్పుడు పట్టపగలే లూటీలు, దొంగతనాలు చేసుకోవచ్చు

పట్టపగలు షాపుల లూటీ, దొంగతనాలు నేరం కాదంటున్నారేంటని ఆశ్చర్యపోతున్నారా..నిజమే ఇది. యధేఛ్చగా దొంగతనాలు చేసుకోవచ్చు. లూటిలకు పాల్పడవచ్చు. అక్కడ పోలీసులు ఉన్నా..మిమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేయరు. 

అమెరికాలో నేరాలు, దోపిడీలు ఎక్కువే అని అందరికీ తెలుసు. పట్టపగలే లూటీలు జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో కాలిఫోర్నియాలో కొత్తగా తెచ్చిన ప్రొపోజిషన్ 47 చట్టం ఆ నేరాల్ని మరింతగా పెంచనుందా..అసలేం జరుగుతోంది అక్కడ.

కాలిఫోర్నియా రాష్ట్రంలో కొత్త చట్టం అమల్లో వచ్చింది. ఈ చట్టం పేరు ప్రొపోజిషన్ 47. కొత్త చట్టం అమల్లో రావడంతో చిన్న చిన్న లూటీలు, దొంగతనాలు బహిరంగమైపోయాయి. లూటీలు, దోపీడీలు తట్టుకోలేక శాన్‌ఫ్రాన్సిస్కోలో షాపులు మూతపడుతున్నాయి. చాలామంది షాపు యజమానులు షాప్స్ తెరిచేందుకు భయపడుతున్నారు. బహిరంగంగా షాపుల్ని లూటీ చేస్తున్నా..పోలీసులు చోద్యం చూస్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

ప్రపంచంలో మోస్ట్ సివిలైజ్డ్ దేశంగా చెప్పుకునే అమెరికాలో ఇప్పుడు పట్టపగలే  షాపులు లూటీ అవుతున్నాయి. లూటీలు, దొంగతనాల భయంతో ఇప్పటికే శాన్‌ఫ్రాన్సిస్కోలోని వాల్‌గ్రీన్ వీధిలో 17 షాపులు మూతపడ్డాయి. పట్టపగలే లూటీలు జరుగుతున్నా పోలీసులు చోద్యం ఎందుకు చూస్తున్నారు, ఎందుకీ పరిస్థితి అని ప్రశ్నించుకుంటే కాలిఫోర్నియాలో కొత్తగా అమలైన ప్రొపోజిషన్ 47 చట్టం కన్పిస్తుంది.

ఎందుకీ పరిస్థితి

అగ్రరాజ్యంలో అమలవుతున్న ప్రొపోజిషన్ 47 చట్టం కారణంగా షాపుల్లో లూటీ లేదా దోపిడీ అనేది ఇప్పుడు నేరం కాదు. ఎవరైనా సరే అత్యవసరమని భావిస్తే..పట్టపగలకే యధేచ్ఛగా దొంగతనాలు చేయవచ్చు. అయితే పరిమితికి లోబడి ఉండాలి. అంటే 900 డాలర్ల కంటే తక్కువ ఖరీదైన ఆహార పదార్ధాలు లేదా నిత్యావసరాల్ని దొంగిలిస్తే నేరం కాదు. అందుకే ఇప్పుడు లూటీలు పెరిగిపోతూ..యజమానులు షాపులు మూసే పరిస్థితి వస్తోంది. 

ప్రొపోజిషన్ 47 చట్టంలో ఏముంది

ప్రొపోజిషన్ 47 చట్టం ప్రకారం నేరాలు, అపరాధాల్ని రీ డిఫైన్ చేసింది ప్రభుత్వం. అంటే నేరాల్ని ఇప్పుడు అపరాధాలుగా మార్చింది. అపరాధమంటే చిన్న చిన్న స్థాయి లూటీలు, దొంగతనాలు. నేరాలంటే నిర్వచనం లోతుగా ఉంటుంది. అలాగని 900 డాలర్ల కంటే తక్కువ ఖరీదైన వస్తువుల్ని దొంగిలించుకోవచ్చని కానే కాదు. కానీ ఈ చట్టం ప్రకారం 900 డాలర్ల కంటే తక్కువ విలువైన వస్తువులు దొంగిలిస్తే శిక్ష తక్కువగా ఉంటుందని అర్ధం. కొత్త చట్టం ప్రకారం పెనాల్టీ కూడా తగ్గిందని తెలుస్తోంది. 

వాస్తవానికి ఈ చట్టం చాలాకాలంగా కాలిఫోర్నియాలో అమల్లో ఉన్నా...ఇటీవల ఈ చట్టం ప్రభావంతో పెరుగుతున్న లూటీలు, మూతపడుతున్న షాపులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాంతో ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం రచ్చగా మారుతోంది. 

Also read: World Largest Camera: ప్రపంచంలోనే అతిపెద్ద కెమేరా ఇదే, సైజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News