Prostitution Racket Busted in Hyderabad: హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లలో వ్యభిచారం దందాకు బ్రేకులు పడటం లేదు. కొంతమంది కేటుగాళ్లు హై ప్రొఫైల్ ఏరియాలలో అపార్ట్‌మెంట్లలో ఏదో ఒక వ్యాపారం పేరిట ఆఫీసులు ఏర్పాటు చేసుకుని ఎవ్వరికీ అనుమానం రాకుండా వ్యభిచారం దందా కొనసాగిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు తరచుగా దాడులు జరిపి అపార్ట్‌మెంట్లలో జరుగుతున్న సెక్స్ రాకెట్ల గుట్టురట్టు చేస్తున్నప్పటికీ.. నగరం నలుమూలలా ఏదో ఓ చోట ఈ దందా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్లో సీక్రెట్‌గా జరుగుతున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయదుర్గంలో పట్టుబడిన సెక్స్ రాకెట్ ముఠాలో 8 మంది మహిళలు, ఇద్దరు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సెక్స్ రాకెట్‌లో పట్టుబడిన మహిళల్లో సినీ పరిశ్రమకు సంబంధించిన వారు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయింది. గతంలో పలు సందర్భాల్లో జరిగిన పోలీసు రైడ్స్‌లో పలువురు సినీ ప్రముఖులు, జూనియర్ ఆర్టిస్టులు పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వార్తా కథనాలు పతాక శీర్షికలకెక్కాయి. దీంతో ఈసారి పట్టుబడిన సెక్స్ రాకెట్‌లో ఎవరు పట్టుబడ్డారనే చర్చ మొదలైంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Also Read : Crime News: తండ్రితో పెళ్లికి నిరాకరించిందని యువతి బట్టలు విప్పి, జుట్టు కత్తిరించి బూట్లు నాకించిన వైనం.. ఎక్కడంటే?


Also Read : Crime News: బామ్మర్దిపై ఉన్న కోపంతో అతడి భార్యపై.. అతి కిరాతకంగా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి