Illicit Relationship: నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లినే దారుణంగా చిత్రహింసలకు గురిచేసే కాలం ఇది. ప్రస్తుతం మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతుందనడానికి సమాజంలో నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. అలాంటి కిరాతకులు ఉన్న ఈ సమాజంలో అమ్మ తర్వాత అమ్మ లాంటి వదినమ్మపై కూడా కొందరు దౌర్భాగ్యులు కన్నేస్తున్నారు. అక్రమ సంబంధాన్ని పెట్టుకొని ఎన్నో కాపురాలను కూలుస్తున్నారు. కామ వాంఛతో అత్యంత నీచానికి దిగజారుతున్నారు. అలాంటి వారి వల్ల కుటుంబ బాంధవ్యాలు దెబ్బతినడంతో పాటు ఎంతో మంది అవమానంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి ఓ పాశవిక ఘటన హైదరాబాద్ లోని బోయిన్‌పల్లిలో జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అన్న భార్యని ప్రేమించిన ఓ వ్యక్తి.. ఆమెతో అక్రమ సంబంధానికి దిగజారాడాడు. శారీరిక సంబంధం పెట్టుకోవడం సహా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అయితే అందుకు ఆమె నిరాకరించడం వల్ల ఆవేదనకు గురైన తమ్ముడు.. అతని ప్రాణాలు తీసుకున్నాడు. 


ఏం జరిగిదంటే?
హరియాణా రాష్ట్రానికి చెందిన ప్రదీప్ కుమార్ (23) తన సన్నిహితులతో కలిసి వోల్డ్ బోయినపల్లి జీఎస్టీ కాంప్లెక్స్ లో నివసిస్తున్నాడు. స్థానికంగా రవాణా సంబంధిత పనులు చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రదీప్ కుమార్ కు ఓ అన్నయ్య (పెద్దమ్మ కుమారుడు) శివ్ కుమార్ ఉన్నాడు. ఉపాధి కోసం హైదరబాద్ నగరానికి తన భార్యతో కలిసి బోయిన్‌పల్లికి వచ్చి ఉంటున్నాడు. ఈ క్రమంలో అన్న వాళ్ల నివాసానికి ప్రదీప్ కుమార్ అప్పుడప్పుడు వెళ్తుండేవాడు. 


Also Read: Kishan Reddy: ఆత్మహత్యలు చేసుకోవద్దు.. హోంగార్డుల హక్కుల సాధన కోసం నేను ముందుంటా: కిషన్ రెడ్డి  


తొలుత అన్న భార్యతో ప్రదీప్ స్నేహంగా ఉండేవాడు. ఆ తర్వాత స్నేహం ప్రేమకు దారితీసింది. ఆ ప్రేమ అక్రమ సంబంధానికి కారణమయ్యింది. ఆమె మీద ప్రేమని మరింత పెంచుకున్న ప్రదీప్ అన్నయ్య శివ్ కుమార్ ను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని గత కొంతకాలంగా వదినని ఒత్తిడి చేయసాగాడు. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. 


అయితే సెప్టెంబరు 6వ తేది బుధవారం.. ప్రదీప్ మరోసారి తన వదినకు ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని కోరాడు. అయినప్పటికీ ఆమె అంగీకరించలేదు. ప్రదీప్ ను ఎంత మార్చాలని ఆమె ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆవేదనకు గురైన ప్రదీప్.. తన ప్రేయసి లేని జీవితాన్ని ఊహించుకోలేక పోయాడు. తనకు చావే చివరికి దిక్కని భావించాడు. వదినకు కాల్ చేసి నువ్వు లేని జీవితం నాకు కూడా వద్దంటూ ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్ పెట్టేశాడు. దీంతో ఆందోళన చెందిన ఆమె.. వెంటనే భర్త శివ్ కుమార్ కు సమాచారాన్ని అందించింది.  


వెంటనే అప్రమత్తమైన శివ్ కుమార్.. ప్రదీప్ కుమార్ స్నేహితులకు ఈ విషయాన్ని చేరవేశాడు. వారంతా గదిలోకి వెళ్లి చూడగా.. తాళం వేసి ఉంది. తలుపు పగులకొట్టి చూడగా.. అప్పటికే ప్రదీప్ కుమార్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Rhinos Vs Lions, Tigers vs Elephants: అడవికి రాజు ఎవరో తెలియాలంటే ఈ వీడియో చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook