Cricket Betting: బెట్టింగ్‌లో రూ.5 కోట్ల నష్టం.. అత్తామామ ఆస్తి కోసం బావమరిది హత్య
A Man Killed His Brother In Law For Cricket Betting: బెట్టింగ్ వ్యవహారాలు ఓ నిండు ప్రాణాన్ని తీశాయి. ఒకరు చేసిన అప్పుకు మరొకరు బలయ్యారు. బెట్టింగ్ కోసం సొంత బామ్మర్దినే హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
Brother In Law: బెట్టింగ్ వ్యవహారాలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అన్నింటా బెట్టింగ్‌కు పాల్పడుతూ ఆర్థికంగా నష్టపోతున్న వారు ఆత్మహత్యలకు పాల్పడడం లేదా ఇతరులను హతమార్చడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. క్రికెట్ బెట్టింగ్‌లో రూ.5 కోట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిన ఆయనకు అత్తవారింటి ఆస్తిపై కన్ను పడింది. ఒక్కగానొక్క బావమరిదిని చంపేస్తే వారి ఆస్తి మొత్తం తనకే సొంతమవుతుందని భావించి ఓ వ్యక్తి తన బావమరిదిని అతి కిరాతకంగా హత్యకు పాల్పడ్డాడు. ఆత్యహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Also Read: Attack On Minor Girl: ఏపీలో పెట్రేగిపోతున్న గంజాయ్ బ్యాచ్.. బాలికపై పాశవిక దాడి
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీకాంత్ హైదరాబాద్‌లో హాస్టల్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. అతడికి ఇంతకుముందే వివాహమైంది. అతడికి ఓ బావమరిది కూడా ఉన్నాడు. అయితే బెట్టింగ్‌కు బానిసగా మారిన శ్రీకాంత్ దాదాపు రూ.5 కోట్ల వరకు నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర కష్టాల్లో కూరుకుపోయాడు. ఈ సమయంలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తీవ్రమయ్యాయి. ఈ సమయంలో శ్రీకాంత్ మదిలో దుర్భిద్ధి మొదలైంది. తన అత్తామామ ఆస్తిపై కన్ను పడింది. వారికి ఉన్న ఒక్క కొడుకును చంపేస్తే ఆ ఆస్తి మొత్తం తన వశమవుతుందని భావించాడు.
Also Read: Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో కలకలం.. మహిళా డాక్టర్ చేయి పట్టుకు లాగిన రోగి
హైదరాబాద్ గచ్చిబౌలిలోని పీజీ హాస్టల్ నిర్వహిస్తూ శ్రీకాంత్ తన బావమరిదిని తీసుకువచ్చాడు. హాస్టల్ నిర్వహించేందుకు మంచి నమ్మకస్తుడు కావాలని అత్తామామకు చెప్పి తన బావమరిదిని పిలిపించుకున్నాడు. హాస్టల్ వ్యవహారాలు అప్పగించాడు. అయితే కొన్నాళ్లకు బావమరిదిపై తప్పుడు సమాచారాన్ని అత్తామామలకు ఫోన్ చేసి చెప్పేవాడు. 'మీ అబ్బాయి గంజాయి సేవిస్తున్నాడు. చెడు వ్యసనాల అలవాటుపడ్డాడు' అంటూ బావమరిదిపై లేనిపోని ఆరోపణలు చేశాడు.
ఇటీవల బావమరిదిని సుపారీ గ్యాంగ్‌తో కిరాతకంగా హత్య చేయించాడు. ఏం తెలియనట్టు ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు విచారణ చేపట్టి సీసీ కెమెరా గుట్టు రట్టు చేయగా.. శ్రీకాంత్ చేసిన మోసం, దారుణం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా మృతదేహంపై గాయాలు ఉండడంతో అత్తామామ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య జరిగిన రోజు హాస్టల్ సీసీటీవి ఫుటేజ్‌ను డిలీట్ చేయడంతో అతడి మోసం బయటపడింది. మొత్తం కూపీ లాగగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.